July 17, 2026

NEET UG రీటెస్ట్ 2026 ఫలితాల్లో ఈ మార్పులు గమనించారా..? టాప్‌ ర్యాంకులన్నీ వారివే

NEET UG రీటెస్ట్ 2026 ఫలితాల్లో ఈ మార్పులు గమనించారా..? టాప్‌ ర్యాంకులన్నీ వారివే
Reading Time: 2 minutes
NEET UG రీటెస్ట్ 2026 ఫలితాల్లో ఈ మార్పులు గమనించారా..? టాప్‌ ర్యాంకులన్నీ వారివే

హైదరాబాద్, జులై 17: నీట్ యూజీ 2026 రీటెస్ట్‌ ఫలితాలు గురువారం (జులై 16) రాత్రి విడుదలయ్యాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా నీట్ (NEET UG) 2026 ఫలితాలను ఎన్‌టీఏ (NTA) విడుదల చేసింది. వైద్య, దంత, ఆయుష్ ఇతర కోర్సులలో ప్రవేశానికి మొత్తం 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫలితాల్లో పంజాబ్, హర్యానా విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారు. మెడికల్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌కు అనుగుణంగానే ఎన్టీయే సకాలంలో ఫలితాలు ప్రకటించింది. మే 3న నిర్వహించిన నీట్‌ యూజీ పరీక్ష పేపర్ లీక్‌ కారణంతో రద్దుకాగా.. రెండోసారి నీట్ పరీక్షను జూన్‌ 21న పకడ్భందీగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొత్తం 13 భాషల్లో విజయవంతంగా నీట్ పరీక్షను ఎన్‌టీఏ నిర్వహించింది. దేశంలోని 551 నగరాల్లో,విదేశాల్లోని 14 నగరాల్లో ఉన్న 5,440 కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 20 లక్షల మంది హాజరుకాగా.. ఇందులో 11.21 లక్షల మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. తాజాగా నీట్ ఫలితాల్లో మహిళలు మరోసారి సత్తా చాటారు. క్వాలిఫై అయిన వారిలో 58 శాతానికి పైగా మహిళలే ఉండటం గమనార్హం.

నీట్‌ యూజీ 2026 రీటెస్ట్‌ ఫలితాలు, స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మొత్తం 720 మార్కులకు గానూ 715 మార్కులతో దేశంలోనే జాయింట్ టాపర్స్‌గా నిలిచిన ఆర్యన్ గుప్తా, పన్షుల్ బన్సల్ నిలిచారు. 138 మంది విద్యార్థులకు 690కి పైగా మార్కులు వచ్చాయి. అత్యధికులు 17-19 ఏళ్ల వయసు వారే కావడం గమనార్హం. టాప్ స్థానంలో నిలిచినఆర్యన్ గుప్తా (పంజాబ్) 720, పన్షుల్ బన్సల్ (హర్యానా) 715 మార్కులతో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. 700 కంటే ఎక్కువ మార్కులు 19 మంది అభ్యర్థులు సాధించారు. 690 కంటే ఎక్కువ మార్కులు 138 మంది అభ్యర్థులు సాధించారు. 650 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు 1,492 మంది ఉన్నారు. 600 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు 10,160 మంది ఉన్నారు. 500 పైగా మార్కులు సాధించిన అభ్యర్థులు 90,780 మంది ఉన్నారు. అర్హత సాధించిన వారిలో 58% కంటే ఎక్కువ మంది మహిళలు ఉండగా.. పురుషుల అర్హత శాతం 55.1%గా నమోదైంది. ఉత్తర ప్రదేశ్ నుంచి అత్యధికంగా 1.7 లక్షలకు పైగా అభ్యర్థులు అర్హత సాధించారు.

మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు పరిశీలిస్తే.. జనరల్ కేటగిరీ నుండి 2.91 లక్షల మంది, ఓబీసీ-ఎన్‌సీఎల్ నుండి 5.12 లక్షల మంది, ఎస్సీ నుండి 1.59 లక్షల మంది, ఎస్టీ నుండి 63,716 మంది జనరల్-ఈడబ్ల్యూఎస్ నుండి 95,026 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. నీట్ ఫలితాల నేపథ్యంలో సీట్ల కేటాయింపు, స్కోర్ పెంపు పేరిట వచ్చే నకిలీ కాల్స్, మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎన్‌టీఏ హెచ్చరికలు జారీ చేసింది.

నీట్‌ యూజీ 2026 రీటెస్ట్‌ ఫలితాలు, స్కోర్‌ కార్డు డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.