July 17, 2026

గార్డియన్ ఇండియా హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ చేతికి

గార్డియన్ ఇండియా హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ చేతికి
Reading Time: < 1 minute

గార్డియన్ ఇండియా హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ చేతికి

Caption of Image.

న్యూఢిల్లీ :  హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ టెక్ అమెరికాకు చెందిన గార్డియన్ లైఫ్ ఇన్సూరెన్స్ సబ్సిడరీ  గార్డియన్ ఇండియా ఆపరేషన్స్​ను కొనుగోలు  చేయనుంది. ఈ డీల్ విలువ 10.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 101 కోట్లు). ఈ కొనుగోలు ద్వారా గార్డియన్ ఇండియా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌‌లో ఉన్న దాదాపు 2  వేల మంది ఉద్యోగులు హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ టెక్‌‌‌‌లోకి బదిలీ కానున్నారు.  

ఈ కొనుగోలుతో పాటు గార్డియన్ లైఫ్ ఇన్సూరెన్స్‌‌‌‌తో హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ టెక్ ఏడేళ్ల పాటు సుదీర్ఘ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ అమెరికన్ కంపెనీ ప్రొడక్టులలో టెక్నాలజీ ఇన్నోవేషన్స్‌‌‌‌, ఆపరేషనల్ ట్రాన్స్‌‌‌‌ఫార్మేషన్ కోసం హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ టెక్ ఒక బిజినెస్ యూనిట్‌‌‌‌ను ఏర్పాటు చేయనుంది.
 

©️ VIL Media Pvt Ltd.