July 17, 2026

Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB

Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
Reading Time: < 1 minute
Maa Inti Bangaaram Ott Release Samanthas 100 Crore Blockbuster Out Now On Jiohotstar

సమంత లీడ్ రోల్ లో దర్శకురాలు నందిని రెడ్డి కలయికలో వచ్చిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ ‘మా ఇంటి బంగారం. గత నెల 19న థియేటర్స్ లో అడుగుపెట్టిన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది.  తెలుగు సినిమా చరిత్రలోనే ఒక హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేయడం ఇదే మొదటిసారి. అంతటి సెన్సేషన్ చేసి రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టిన ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. 

ఈ చిత్రాన్ని జియోహాట్‌స్టార్ ఓటీటీ సంస్థ సౌత్ ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది.  తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మరియు మలయాళ భాషల్లో నేటి నుండి స్ట్రీమింగ్ అవుతూ   పాన్ ఇండియా ప్రేక్షకులందరినీ అలరించేందుకు ఈ యాక్షన్ డ్రామా సిద్ధమైంది. వివాహం తర్వాత అత్తారింటికి వచ్చిన కోడలు తన గతాన్ని దాచిపెడుతూ, సాధారణ గృహిణిగా మెప్పించడానికి ప్రయత్నిస్తుంది. కానీ తన గతం వల్ల ప్రస్తుత కుటుంబానికి ముప్పు వాటిల్లినప్పుడు ఆమె ఎలా పోరాడింది? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది? అనే ఆసక్తికరమైన కుటుంబ, యాక్షన్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. సమంత తన అద్భుతమైన నటన, యాక్షన్ సీక్వెన్స్‌లతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ సినిమాను సమంత స్వయంగా నిర్మించింది. ఈ వీకెండ్ కు ఫ్యామిలీతో సరదాగా చూసేయండి.