SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత

రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘స్పిరిట్‘. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు స్కై హై రేంజ్‌లో ఉన్నాయి. సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పటికీ బిజినెస్ పరంగా ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు సంబంధించి ఒక సాలిడ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించిన కర్ణాటక పంపిణీహక్కులను ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ కైవసం చేసుకుంది. కర్ణాటక మార్కెట్లో ప్రభాస్ సినిమాలకు ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా, ఏషియన్ సినిమాస్ సంస్థ భారీ ఫాన్సీ రేటు చెల్లించి ఈ హక్కులను దక్కించుకున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. ఈ డీల్‌తో సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో స్పిరిట్ సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిందని చెప్పాలి. టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ‘యానిమల్’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో బిజినెస్ వర్గాల్లో ‘స్పిరిట్’ క్రేజ్ మామూలుగా లేదు. కర్ణాటక రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోవడంతో మిగిలిన ఏరియాల రైట్స్ కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. త్వరలోనే అందుకు సంబంధించిన మరిన్ని డీల్స్ కానున్నాయి. భారీ అంచనాలున్న ఈ సినిమాను భూషణ్ కుమార్ తో కలిపి సందీప్ రెడ్డి వంగ నిర్మిస్తున్నారు.