Reading Time: < 1 minute
Ram Charan Sukumar Next Movie Launch Date Dasara Mythri Movie Makers

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిక్స్డ్ టాక్ తో కూడా సుమారు 400 కోట్ల కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కొన్నిచోట్ల కలెక్షన్ల విషయంలో కొంత చర్చోపచర్చలు జరుగుతున్నా, రామ్ చరణ్ తర్వాతి సినిమా మీద ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తర్వాతి సినిమా ఉండబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లోనే రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో, అలాగే సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ సహ నిర్మాణంలో ఈ సినిమా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లాక్ అయినట్లుగా చెబుతున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ కూడా దసరాకి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దసరాకి ఒక పూజా కార్యక్రమం ఏర్పాటు చేసి, ఆ తర్వాత త్వరలోనే షూట్ కి కూడా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. నిజానికి ‘RRR’ తర్వాత రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది. ఆ తర్వాత ‘గేమ్ ఛేంజర్’ సినిమా నిరాశపరిచినా కూడా, తర్వాతి సినిమా మిక్స్డ్ టాక్ తో కూడా దూసుకుపోయింది. ఈ క్రమంలో రామ్ చరణ్, సుకుమార్ తో చేయబోతున్న సినిమాని కూడా దసరాకి ప్రారంభించి, వీలైనంత త్వరగానే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.