Varsham Movie: వర్షం సినిమాలో ప్రభాస్ మేనల్లుడు గుర్తున్నాడా.. ? ఇప్పుడు పెద్ద క్యాస్టింగ్ డైరెక్టర్.. ప్రతి సినిమా బ్లాక్ బస్టరే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాల్లో వర్షం ఒకటి. దివంగత డైరెక్టర్ శోభన్ దర్శకత్వంలో డార్లింగ్, త్రిష జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అప్పటివరకు వరుస ప్లాపులతో నెట్టుకొస్తున్న డార్లింగ్ కెరీర్ మార్చింది ఈ సినిమా. ఇదిలా ఉంటే.. ఈ సినిమా అప్పట్లో వసూళ్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో ప్రకాష్ రాజ్, సునీల్, సుమ కనకాల కీలకపాత్రలు పోషించారు. అలాగే ఈ సినిమాలో గోపిచంద్ విలన్ పాత్రలో అదరగొట్టాడు. ఈ సినిమా నుంచి ప్రభాస్, గోపిచంద్ ఇద్దరూ ప్రాణస్నేహితులుగా మారారు. అప్పుడు మొదలైన వీరి స్నేహబంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. మరోవైపు గోపిచంద్ సైతం హీరోగా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ప్రభాస్ మేనల్లుడిగా కనిపించిన కుర్రాడు గుర్తున్నాడా.. ?
ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..
వర్షం సినిమాలో ప్రభాస్ మేనల్లుడిగా కనిపించిన చిన్నోడి పేరు అక్షయ్ బచ్చు. ఈ కుర్రాడి పేరు అందరికి తెలియకపోవచ్చు.. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అతడు సుపరిచితమే. వర్షం సినిమాలో నటించిన అక్షయ్.. నాగార్జున, శ్రియా నటించిన సంతోషం మూవీలోనూ చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు. ఇందులో నాగ్ తనయుడిగా నటించి మెప్పించాడు. అయితే కేవలం తెలుగు సినిమాలే కాకుండా హిందీలోనూ పలు సినిమాల్లో నటించాడు. అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై బాలనటుడిగా తనదైన ముద్ర వేశాడు. అక్షయ్ ఎక్కువగా యాడ్ ఫిల్మ్స్ ద్వారా ఫేమస్ అయ్యాడు. చిన్న వయసులోనే దాదాపు 45 యాడ్ ఫిల్మ్స్ చేశాడు.
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
అయితే చదువుల కోసం సినిమాలకు గుడ్ బై చెప్పిన అక్షయ్.. ప్రస్తుతం సినీరంగంలోనే రాణిస్తున్నాడు. నటుడిగా, గాయకుడిగా మెప్పిస్తున్నాడు. అంతేకాదు.. హిందీలో పలు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్ గానూ వర్క్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అలరిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ చిన్నోడి లేటేస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..
అక్షయ్ బచ్చు..
ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..