July 15, 2026

AK 64 : శ్రీలీల ఆఫర్ కయాద్ లోహార్ తన్నుకు పోయిందా..?

AK 64 : శ్రీలీల ఆఫర్ కయాద్ లోహార్ తన్నుకు పోయిందా..?
Reading Time: < 1 minute
Sreeleela Replaced By Kayadu Lohar In Ajith Kumars Ak64

లెనిన్ నుండి శ్రీలీల తప్పుకుని మంచే చేసిందన్న ట్రోలింగ్ వేళ.. మరో క్రేజీ ప్రాజెక్ట్ నుండి వైరల్ వయ్యారీని తప్పించారన్న బజ్ వినిపిస్తోంది. అజిత్ 64లో శ్రీలీల హీరోయిన్‌గా నటించబోతుందని ఎప్పటి నుండో వార్తలొస్తున్నాయి. టీం అఫీషియల్ కన్ఫర్మేషన్ చేయనప్పటికీ.. వైరల్ వయ్యారే హీరోయిన్ అంటూ ఫిక్సయ్యారు తమిళ తంబీలు. కానీ రీసెంట్లీ వినిపిస్తోన్న రూమర్ ప్రకారం కయాద్ లోహార్ ఫిక్సైందట.

గుడ్ బ్యాడ్ అగ్లీతో హిట్టిచ్చాడని అజిత్ మరోసారి అధిక్ రవిచంద్రన్‌కు ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పట్టాలెక్కాల్సిన అజిత్64 ఒక్క స్టెప్ కూడా ముందుకు పడలేదు. అజిత్ స్పోర్ట్స్‌పై ఫోకస్ చేయడంతో పాటు రెమ్యునరేషన్ భారీగా అడుగుతుండటంతో మేకర్స్ అజిత్ జోలికి పోవడం లేదని కోలీవుడ్ బజ్. ఏకే 64కి నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో అజితే ఈ సినిమాను నిర్మించాలని ఫిక్స్ అయ్యాడని టాక్. కొయంబత్తూరుకు చెందిన ఓ ఇండస్ట్రీయలిస్ట్‌తో కలిసి మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలో తన ప్రొడక్షన్ హౌస్ ఎనౌన్స్ చేస్తాడట. ఆగస్టులో ఏకే 64 సెట్స్‌పైకి వెళ్లనుందని బజ్. అజిత్ సరసన శ్రీలీలకు బదులు కయాద్ తీసుకుంటున్నారట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆఫర్స్ లేకపోవడంతో కోలీవుడ్‌పై ఆశలు పెట్టుకున్న లీలకు ఇది పెద్ద ఝలక్కే.