July 14, 2026

ఏపీ సీనియర్ పొలిటీషియన్ ముద్రగడ పద్మనాభం కన్నుమూత !

ఏపీ సీనియర్ పొలిటీషియన్ ముద్రగడ పద్మనాభం కన్నుమూత !
Reading Time: < 1 minute

ఏపీ సీనియర్ పొలిటీషియన్ ముద్రగడ పద్మనాభం కన్నుమూత !

Caption of Image.

హైదరాబాద్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొన్ని నెలల నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ముద్రగడ కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న జన్మించారు. ఆయన సొంతూరు తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి.

ఏపీకి చెందిన సీనియర్ రాజకీయ నాయకుల్లో ముద్రగడ పద్మనాభం ఒకరు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. ఒక పర్యాయం కాకినాడ నుంచి ఎంపీగా సేవలందించారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి కేబినెట్లలో మంత్రిగా చేశారు.

ముద్రగడకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ముద్రగడ పద్మనాభం వయసు 73 సంవత్సరాలు. ముద్రగడ కొంతకాలం వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ను ఓడించలేకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ఆయన సవాల్ విసిరారు.

2024 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో.. ఆయన తన సవాల్కు కట్టుబడి తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటూ గెజిట్ కూడా విడుదల చేశారు. అప్పటి నుంచి ఆయనను ప్రత్యర్థులు ముద్రగడ పద్మనాభ రెడ్డిగానే పిలుస్తు్న్నారు.

©️ VIL Media Pvt Ltd.