Reading Time: < 1 minute
Former Mha Official Alleges Shoaib Akhtar Mohammad Asif Drug Smuggling

RVS Mani: భారత హోం మంత్రిత్వ శాఖ మాజీ అండర్ సెక్రటరీ ఆర్వీఎస్ మణి సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తానీ క్రికెట్ ఆటగాళ్లు, ప్రతినిధి బృందానికి సంబంధించి ఒక సంచలనాత్మ విషయాన్ని వెల్లడించారు. 2006-07 సమయంలో పాకిస్తానీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్ వంటి ఆటగాళ్లు భారత్ వచ్చినప్పుడల్లా డ్రగ్స్ తీసుకువచ్చే వారని అన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. దీంట్లో ఐఎస్ఐ ప్రమేయం ఉందని చెప్పారు.

ఏఎన్ఐ పోడ్‌కాస్ట్‌లో ఆయన ఈ సంచనల విషయాన్ని వెల్లడించారు. భారత్‌లో ఉగ్రవాదం వ్యాప్తి చెందడంలో డ్రగ్స్ అక్రమ రవాణా ప్రముఖంగా ఉందని, ఉగ్రవాదానికి 30 శాతం నిధులు డ్రగ్స్ స్మగ్లింగ్ నుంచే వస్తున్నాయని ఆయన అన్నారు. అక్తర్, ఆసిఫ్ డ్రగ్స్ తీసుకువచ్చనట్లు పాకిస్తానీ హైకమిషనర్ వద్ద అంగీకరించినట్లు నివేదిక ఉన్నట్లు మణి చెప్పారు.

పాకిస్తాన్ క్రికెట్ కోచ్ బాబ్ వూల్మర్ మార్చి 18, 2007లో మరణించిన విసయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 2007 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా జమైకాలోని కింగ్‌స్టన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయిన మరుసటి రోజు, ఆయన తన హోటల్ గదిలో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆయన మరణించారు. డ్రగ్స్, ఉగ్రవాదం మధ్య సంబంధాన్ని చెబుతూ.. జలాలాబాద్‌లో నల్ల మందు ఎక్కువగా పండితే , భారత్‌లో ఉగ్రవాద దాడులు ఎక్కువగా జరుగుతాయని తాము అనుకుంటామని చెప్పారు.