July 15, 2026

నవంబర్ 19న  ఇందిరమ్మ బీమా ప్రారంభిస్తం..బీఆర్ఎస్ అప్పులకు.. అసలు,మిత్తి రూ. 2. 8 లక్షల కోట్లు కట్టాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నవంబర్ 19న  ఇందిరమ్మ బీమా ప్రారంభిస్తం..బీఆర్ఎస్ అప్పులకు.. అసలు,మిత్తి రూ. 2. 8 లక్షల కోట్లు కట్టాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Reading Time: 2 minutes

నవంబర్ 19న  ఇందిరమ్మ బీమా ప్రారంభిస్తం..బీఆర్ఎస్ అప్పులకు.. అసలు,మిత్తి రూ. 2. 8 లక్షల కోట్లు కట్టాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Caption of Image.
  • ఫ్రీ కరెంటుకు పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీదేనన్న డిప్యూటీ సీఎం

గద్వాల/శాంతినగర్, వెలుగు: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్19న రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం ఆయన జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. అలంపూర్ నియోజకవర్గం జులేకల్, పచ్చర్ల, పుల్లూరు, మేడికొండలో నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్లను మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి భట్టి ప్రారంభించారు.

ఎర్రవల్లి మండల కేంద్రంలో రూ. 155 కోట్లతో నిర్మించనున్న 220 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రైతులకు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మర్లను పంపిణీ చేశారు. జూలకల్, కుర్తి రావులచెరువు గ్రామాల్లో జరిగిన సభల్లో భట్టి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 8.25 లక్షల కోట్ల అప్పులతో తమకు రాష్ట్రాన్ని అప్పగించిందని, కేవలం రెండున్నర ఏళ్లలోనే రూ. 2.8 లక్షల కోట్లు అసలు, వడ్డీరూపంలో తమ ప్రభుత్వం కట్టిందని చెప్పారు.

వాళ్ల అప్పులకు నెలకు రూ. 6 వేల కోట్ల మిత్తి కడుతున్నామన్నారు. అయినా అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తునే కొత్త స్కీంలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. కరెంటు అంటేనే కాంగ్రెస్ అని.. ఫ్రీ కరెంటు పేటెంట్ హక్కు కాంగ్రెస్ దేనన్నారు. మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, రైతులకు మంచి ప్యాకేజీ ఇచ్చి 573 ఎకరాల భూమిని సేకరిస్తామన్నారు. 

మల్లమ్మకుంటతో 87 వేల ఎకరాలకు నీళ్లు: జూపల్లి 

రాష్ట్రంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అలంపూర్ నియోజకవర్గం పరిధిలోని మల్లమ్మకుంట రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు10 టీఎంసీలు ఎత్తిపోసి 87,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారని మంత్రి వాకిటి శ్రీహరి ధ్వజమెత్తారు.

మాజీ మంత్రి హరీశ్ రావు మూడు నెలలు తనకు అధికారం కావాలని అడుగుతున్నారని, తొమ్మిదిన్నర ఏళ్లలో చేయని పని మూడు నెలల్లో ఏం చేస్తారని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్​రెడ్డి, అనిరుధ్ రెడ్డి, వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.