July 14, 2026

మీ దగ్గర ఇంకా రూ.2,000 నోట్లు ఉన్నాయా?.. RBI ఏమని చెప్పిందంటే?

మీ దగ్గర ఇంకా రూ.2,000 నోట్లు ఉన్నాయా?.. RBI ఏమని చెప్పిందంటే?
Reading Time: 2 minutes

మీ దగ్గర ఇంకా రూ.2,000 నోట్లు ఉన్నాయా?.. RBI ఏమని చెప్పిందంటే?

Caption of Image.

మీ ఇంట్లో, పర్స్‌లో లేదా లాకర్‌లో ఇంకా రూ.2వేల నోట్లు ఉన్నాయా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. RBI మరోసారి కీలక ప్రకటన చేసింది. రూ.2వేల నోట్లు ఇప్పటికీ చెల్లుబాటులోనే ఉన్నాయని.. వాటిని వీలైనంత త్వరగా డిపాజిట్ చేయాలని లేదా మార్చుకోవాలని ప్రజలకు సూచించింది. ఇప్పటికే ఎక్కువ శాతం రూ.2వేల నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని.. ఇంకా మిగిలి ఉన్న నోట్లను కూడా RBI స్వీకరిస్తుందని స్పష్టం చేసింది.

అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు సాధారణ బ్యాంకు బ్రాంచ్‌లలో రూ.2వేల నోట్లను మార్చే అవకాశం లేదు. వాటిని మార్చుకోవాలంటే దేశవ్యాప్తంగా ఉన్న RBIకి చెందిన 19 కార్యాలయాల్లో మాత్రమే అవకాశం ఉంటుంది. మీ నగరంలో RBI ఆఫీస్ లేకపోతే, ఇండియా పోస్ట్ ద్వారా సమీపంలోని RBI కార్యాలయానికి నోట్లు పంపించే సౌకర్యం కూడా ఉంది.

పోస్ట్ ద్వారా నోట్లు పంపేవారు కొన్ని వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. బ్యాంకు ఖాతా సంఖ్య, IFSC కోడ్, ఖాతాదారుడి పేరు, మొబైల్ నంబర్ వంటి వివరాలను స్పష్టంగా నమోదు చేయాలి. ఈ వివరాలు సరిగ్గా ఉంటే నోట్లను పరిశీలించిన తర్వాత వాటికి సమానమైన మొత్తాన్ని నేరుగా మీ బ్యాంకు అకౌంట్లో జమ చేస్తారు. వివరాల్లో క్లారిటీ లేకపోతే డబ్బు జమ కావడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉందని RBI అధికారులు హెచ్చరిస్తున్నారు.

2023లో రూ.2వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించాలని RBI నిర్ణయం తీసుకుంది. అయితే ఆ నోట్లను చెల్లని కరెన్సీగా ప్రకటించలేదు. అందుకే అవి ఇప్పటికీ లీగల్ టెండర్‌గానే కొనసాగుతున్నాయి. అంటే RBI వాటిని స్వీకరిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ చివరి నిమిషం వరకు వేచి చూడకుండా.. మీ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను వీలైనంత త్వరగా డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం మంచిది. 

©️ VIL Media Pvt Ltd.