July 14, 2026

ఇది పిచ్చా.. అమాయకత్వమా..! కోర్టులో జడ్జి కుర్చీపై క్షుద్ర పూజలు: మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు

ఇది పిచ్చా.. అమాయకత్వమా..! కోర్టులో జడ్జి కుర్చీపై క్షుద్ర పూజలు: మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు
Reading Time: < 1 minute

ఇది పిచ్చా.. అమాయకత్వమా..! కోర్టులో జడ్జి కుర్చీపై క్షుద్ర పూజలు: మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు

Caption of Image.

బెంగళూర్: ఏదైనా కేసుకు సంబంధించి కోర్టులో తీర్పు అనుకూలంగా రావాలంటే తగిన సాక్ష్యాలు సమర్పించాలి. సరైన ఎవిడెన్స్ ఉంటనే కోర్టులో తీర్పు అనుకూలంగా వస్తుంది. కానీ కోర్టులో అనుకూల తీర్పు రావాలని ఓ మహిళ చేసిన పని చూస్తే ఇది పిచ్చా.. అమాయకత్వమా అనుకుంటారు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటారా.. అక్కడికే వస్తున్నాం ఆగండి.. సివిల్ కేసులో కోర్టులో తీర్పు అనుకూలంగా రావాలని ఓ మహిళ ఏకంగా జడ్జి కుర్చీకే చేతబడి చేసింది. నేరుగా కోర్టుకు వెళ్లి జడ్జి కుర్చీపై క్షుద్రపూజలు చేసింది. సీసీ ఫుటేజీ ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏంటో తెలుసుకుందాం..

పోలీసుల వివరాల ప్రకారం.. కర్నాటక రాష్ట్రం చిక్కబళ్లాపురం నగరంలోని వలసణ్ణ వీధికి చెందిన మంజుల అనే మహిళకు  సంబంధించి కోర్టులో ఓ సివిల్ వివాదం నడుస్తోంది. చిక్కబళ్లాపూర్‌ కోర్టులో ప్రస్తుతం ఈ కేసు విచారణ నడుస్తోంది. అయితే, ఈ కేసులో తనకు అనుకూలంగా తీర్పు రావాలని మంజుల షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన కేసు విచారిస్తోన్న న్యాయమూర్తి కుర్చీకి చేతబడి చేసింది.

క్షుద్రపూజల్లో భాగంగా నేరుగా కోర్టుకు వెళ్లి సదరు జడ్జి కూర్చునే కుర్చీపై మంత్రించిన తెల్ల ఆవాలు చల్లింది. మంజుల కోర్టులో జడ్జి కుర్చీకి తాంత్రిక పూజలు చేసిన దృశ్యాలు న్యాయస్థానంలోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. గమనించిన కోర్టు ప్రధాన పరిపాలనా అధికారి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ALSO READ : రైల్వే ట్రాక్‌‌‌‌లపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి

అధికారి ఫిర్యాదు మేరకు చిక్కబళ్లాపురం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జడ్జి కుర్చీకి క్షుద్రపూజలు చేసిన మంజులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తీర్పు అనుకూలకంగా రావడం కోసం ఏకంగా జడ్జి కుర్చీకి చేతబడి చేసిన ఘటన కోర్టు ఆవరణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

©️ VIL Media Pvt Ltd.