నెల్లూరు జిల్లాలో కలకలం : పోలీసులు తీసుకెళ్లిన వ్యక్తి అనుమానాస్పద మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కలకలం. నెల్లూరు జిల్లాలో పోలీసులు తీసుకెళ్లిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోవటంలో సంచలనంగా మారింది. మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ కేసులో ముద్దాయిగా ఉన్న బొల్లి ఏడుకొండులు అనే వ్యక్తిని.. దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ లో SI హనీఫ్ విచారణ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వ్యక్తి.. అపస్మారక స్థితిలో రోడ్డు పక్కన.. ఓ కాలువ దగ్గర పడి ఉన్నట్లు చెబుతున్నారు బంధువులు. స్థానికుల సమాచారంతో ఏడుకొండలును ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.
మనుబోలు పోలీస్ స్టేషన్ లో పోలీసుల చిత్రహింసలు వల్లే ఏడుకొండలు చనిపోయాడని.. పోలీసులు లాకప్ డెత్ చేశారని.. కేసు వాళ్లపైకి రాకుండా ఉండేందుకు గట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని చెరుకుమూడి దారిలో పడేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఏడుకొండలు మృతదేహాన్ని ఎవరికీ చూపించకుండా గూడురు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించటంపైనా అనుమానాలు బలపడుతున్నాయంటున్నారు బంధువులు. డ
స్టేషన్ లో పోలీసులు చిత్ర హింసలు పెట్టటం, పోలీసులు కొట్టటం వల్లే చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు. పోలీసులు కొట్టి చంపారంటూ పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు. ఏడుకొండలు ఆత్మహత్య చేసుకున్నాడని.. అతని మరణంతో మాకు సంబంధం లేదని వివరణ ఇస్తున్నారు పోలీసులు.