Reading Time: < 1 minute

కీసర ఓఆర్ఓర్‎పై రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి

Caption of Image.

హైదరాబాద్: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం (జులై 17) తెల్లవారుజూమున ఓఆర్ఆర్‏పై రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాలీ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మరణించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. మృతులను మెదక్ జిల్లాకు చెందిన రాములు (60), రషీద్ (40)గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.