July 14, 2026

Preethi Mukundhan: నాకు కావలసిన మొగుడికి ఆ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు

Preethi Mukundhan: నాకు కావలసిన మొగుడికి ఆ ఒక్క క్వాలిటీ ఉంటే చాలు
Reading Time: < 1 minute
Kannappa Actress Preethi Mukundhan Reveals Her Dream Boy Qualities Hrudayam Murali Movie

తెలుగులో ‘కన్నప్ప’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ప్రీతి ముకుందన్, ఈ మధ్యకాలంలో వచ్చిన తమిళ డబ్బింగ్ చిత్రం ‘బ్లాస్ట్ జోన్’తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి ‘కన్నప్ప’ సమయంలోనే ఆమెకు మంచి రికగ్నిషన్ లభించింది, కానీ ‘బ్లాస్ట్ జోన్’ తర్వాత మాత్రం కుర్రకారు అందరికీ ఆమె ఒక కలల యువరాణిగా మారిపోయింది. ఇక సినిమాలతో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉండే ఈ భామ, తాజాగా తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి తన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి అంటూ అతని క్వాలిటీస్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, ఒక రిలేషన్‌షిప్‌లో తాను అన్నిటికంటే ఎక్కువగా ‘ఎంపతీ’ (Empathy) అనే క్వాలిటీని గౌరవిస్తానని చెప్పుకొచ్చింది. అంటే తోటి వారి భావాలను అర్థం చేసుకునే మనసున్న వారిని తాను ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. తనకు కాబోయే లైఫ్ పార్ట్నర్ తన ఎమోషన్స్, తన ఆలోచనలను సరిగ్గా అర్థం చేసుకునే వ్యక్తి అయి ఉండాలని ఆమె చెప్పుకొచ్చింది. ఏదైనా అర్థం చేసుకునే గుణం ఉంటేనే ఆ రిలేషన్ బలంగా ఉంటుందని తాను నమ్ముతానని చెప్పుకొచ్చింది. ఇక ఆమె హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ తమిళ్ మూవీ ‘ఇదయం మురళి’, తెలుగులో ‘హృదయం మురళి’గా రిలీజ్ అయింది. సినిమా కంటెంట్ బాగున్నా కూడా ఎందుకో ఈ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇక ప్రస్తుతం అటు తమిళంతో పాటు తెలుగు మీద కూడా ఫోకస్ చేసి, వరుస సినిమాలు చేసేందుకు ఈ భామ ప్లాన్ చేస్తోంది.