Reading Time: < 1 minute

పొలంలో కనిపించిన మొసలి పిల్ల.. బేబీ క్రొకొడైల్ మస్తు క్యూట్ ఉందిగా..!

Caption of Image.

కొమురం భీం జిల్లా: కొమురం భీం జిల్లా సిర్పూర్ (టి) మండలం పారిగాం గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో మొసలి పిల్ల కనిపించడంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్ఆర్వో శ్రీనివాస్ మొసలిని కాపాడిన ఎల్ములే యశ్వంతును అభినందించారు.

అనంతరం.. మొసలిని స్వాధీనం చేసుకుని వార్థా నదిలో సురక్షితంగా విడిచిపెట్టారు. వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

గత జూన్లో సంగారెడ్డి జిల్లా మెలిగిరిపేట గ్రామ శివారులో ఇలానే మొసళ్ల పిల్లలు కనిపించడం స్థానికంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. గ్రామ శివారులోని పంట పొలంలో 20కి పైగా మొసళ్ల పిల్లలను గ్రామస్తులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సుమారు మొసళ్ల పిల్లలతో పాటు 65 గుడ్లను గుర్తించారు.

►ALSO READ | చికెన్ కాదు గిట్లయితే గుడ్డు కూడా తినలేం.. ఒక్క కోడి గుడ్డు రేటు ఎంతకు పోయిందంటే..

సమీపంలోని చెరువులు, ఇతర నీటి వనరుల్లో పెద్ద సంఖ్యలో మొసళ్లు ఉండే అవకాశం ఉందని వారు అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, నీటి వనరుల వద్దకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అటవీ శాఖ సిబ్బంది మొసళ్ల పిల్లలను సురక్షితంగా పట్టుకుని మంజీరా నదిలో వదిలిపెట్టారు.

©️ VIL Media Pvt Ltd.