July 14, 2026

Dragon : అర్ధరాత్రి RFCలో ఎన్టీఆర్, రుక్మిణి.. ‘డ్రాగన్’ సెట్స్ నుండి క్రేజీ లీక్!

Dragon : అర్ధరాత్రి RFCలో ఎన్టీఆర్, రుక్మిణి.. ‘డ్రాగన్’ సెట్స్ నుండి క్రేజీ లీక్!
Reading Time: < 1 minute
Jr Ntr Prashanth Neel Dragon Movie Night Schedule Shooting Ramoji Film City Rukmini Vasanth

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ‘దేవర’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో పాటు, ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తాడా అనే అంచనాల నేపథ్యంలో ఇది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మోస్ట్ అవైటెడ్ మూవీ అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ప్రస్తుతం ఇది నైట్ షెడ్యూల్‌గా ప్లాన్ చేశారు.

ఈ షెడ్యూల్ షూటింగ్‌లో ఎన్టీఆర్‌తో పాటు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రుక్మిణి వసంత్ కూడా పాల్గొంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు, వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని కీలకమైన ఎమోషనల్ అలాగే డ్రామా సీక్వెన్స్‌లను ఈ నైట్ షెడ్యూల్‌లో దర్శకుడు చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో పాటు హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఎన్టీఆర్ లుక్ కూడా మార్చిన విషయం తెలిసిందే. పర్ఫెక్షన్ కోసం ఎక్కడా రాజీ పడకుండా సినిమా యూనిట్ ఈ సినిమా కోసం కష్టపడుతోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.