July 15, 2026

నీటి కష్టాలు తీరేనా.. తుంగభద్రపై హైపవర్ కమిటీ .. చైర్మన్గా సీడబ్ల్యూసీ మెంబర్

నీటి కష్టాలు తీరేనా..  తుంగభద్రపై హైపవర్ కమిటీ .. చైర్మన్గా సీడబ్ల్యూసీ మెంబర్
Reading Time: < 1 minute

నీటి కష్టాలు తీరేనా.. తుంగభద్రపై హైపవర్ కమిటీ .. చైర్మన్గా సీడబ్ల్యూసీ మెంబర్

Caption of Image.
  • సభ్యులుగా తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలు, కర్నాటక ఇరిగేషన్​ సెక్రటరీ

గద్వాల, వెలుగు : తుంగభద్ర నదీ జలాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ, కర్నాటక, ఏపీ అధికారులను సభ్యులుగా నియమించింది. కమిటీకి సెంట్రల్​వాటర్​కమిషన్​(సీడబ్ల్యూసీ) మెంబర్​చైర్మన్​గా ఉండనున్నారు. తెలుగు రాష్ట్రాల ఈఎన్​సీలు, కర్నాటక జలవనరుల కార్యదర్శి మెంబర్లుగా ఉంటారు. 

దీంతో పాటు సీడబ్ల్యూసీలోని ముగ్గురు సీఈలు, తుంగభద్ర బోర్డు మెంబర్​సెక్రటరీ లేదా కార్యదర్శి సైతం సభ్యులుగా కొనసాగనున్నారు. తుంగభద్ర డ్యామ్​పూడికతీత, నావళి రిజర్వాయర్, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆధునీకరణ వంటి అంశాలపై కమిటీ చర్చించనుంది. ఆర్డీఎస్​కింద నీటి వినియోగం, అవసరాలు, తుంగభద్రలో పేరుకుపోయిన పూడిక, పడిపోయిన నీటి నిల్వ సామర్థ్యంపై కూడా స్టడీ చేసే బాధ్యతను అప్పగించారు. దీంతో పాటు పూడిక  తీసేందుకు అవసరమైన టెక్నాలజీని కమిటీ గుర్తించి ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోనుంది. 

తుంగభద్రలో పూడిక సమస్యను దృష్టిలో పెట్టుకుని నావళి ప్రాజెక్టును నిర్మించాలా ? వద్దా ? అనే విషయంపై సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తుంగభద్రలో సభ్య రాష్ట్రాలకు నీళ్ల పంపిణీ విషయంపైనా చర్చించాల్సి ఉంటుంది.

©️ VIL Media Pvt Ltd.