డ్రగ్స్ స్మగ్లింగ్ చేసిన పాక్ క్రికెట్ టీమ్.. వెలుగులోకి సంచలన విషయాలు!

Pakistan: భారత్– పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అనగానే మైదానంలో నరాలు తెగే ఉత్కంఠ.. స్టేడియం అంతా ప్రేక్షకుల కేకలు.. ఆటగాళ్లు బస్సు దిగి గ్రౌండ్‌లోకి వస్తుంటే వారి చేతుల్లో కేవలం క్రికెట్ కిట్‌లు మాత్రమే ఉన్నాయని మనమంతా అనుకుంటాం.. అందులో బ్యాట్లు, ప్యాడ్‌లు, గ్లోవ్స్ మాత్రమే ఉంటాయని అనుకూంటాం.. కానీ, అదే కిట్ బ్యాగ్‌లలో దేశాన్ని సర్వనాశనం చేసే ఒక భయంకరమైన గుట్టు దాగి ఉందంటే మీరు నమ్ముతారా? ఆట వెనుక ఒక అత్యంత ప్రమాదకరమైన నెట్‌వర్క్ నడిచిందని ఒక మాజీ ఉన్నతాధికారి బాంబు పేల్చారు.
ఆర్‌వీఎస్ మణి సంచలన ఆరోపణలు:
ఏఎన్ఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆర్‌వీఎస్ మణి మాట్లాడుతూ.. ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌ల కోసం పాకిస్థాన్ జట్టు భారత్‌కు వచ్చినప్పుడు కొందరు ప్లేయర్లని డ్రగ్స్ రవాణా చేయడానికి కొరియర్లుగా వాడేవారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్ పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ సమయంలో నిఘా సంస్థలు (Intelligence Agencies) వీరి కదలికలను నిశితంగా గమనించాయని పేర్కొన్నాడు. కానీ, ఇవన్నీ కేవలం ఆయన చేసిన ఆరోపణలు మాత్రమేనని, వీటిపై ఇప్పటి వరకు ఎలాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు గానీ, భారత ప్రభుత్వం గానీ అధికారికంగా ధృవీకరించలేదని తెలుస్తుంది.
►ALSO READ | సూర్య రీఎంట్రీకి బీసీసీఐ కండీషన్.. ఇక నిర్ణయం అతని చేతుల్లోనే!
ఇప్పటి వరకు స్పందించని పాక్ క్రికెటర్లు:
ఆర్‌వీఎస్ మణి ఆరోపణలపై అటు షోయబ్ అక్తర్ కానీ, ఇటు మహ్మద్ ఆసిఫ్ కానీ ఇప్పటి వరకు ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు.. అలాగే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కూడా ఈ విషయమై ఇప్పటి వరకు అధికారిక ఎలాంటి స్పందనను రిలీజ్ చేయలేకపోయింది. ఈ ఆరోపణలకు మద్దతుగా ఇప్పటి వరకు ఎలాంటి పత్రాలు, దర్యాప్తు నివేదికలు లభ్యం కాలేదు.. ఈ ఇంటర్వ్యూలో ఆర్‌విఎస్ మణి చెప్పిన విషయాల ఆధారంగానే ఈ చర్చ నడుస్తోంది.
సోషల్ మీడియాలో తీవ్ర చర్చ
ఈ ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. నెటిజన్ల నుంచి దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తుండగా, మరికొందరు మాత్రం ఎలాంటి బలమైన ఆధారాలు లేనందున ఇలాంటి ఆరోపణల విషయంలో తొందరపడొద్దని హెచ్చరిస్తున్నారు. కోర్టులు లేదా నిఘా సంస్థలు దోషులుగా తేల్చేవరకు ఎవరినీ నిందించలేమంటున్నారు.
#WATCH | During podcast interview to ANI, Former Under Secretary, MHA, RVS Mani said, “There is a reported case of cricketers Shoaib Akhtar and Mohammad Asif, where they were sent back (from India) by the Pakistani High Commission after their confession that they were carrying… pic.twitter.com/SbdjiUhA8r
— ANI (@ANI) July 14, 2026