Reading Time: < 1 minute
Lenin Success Meet Bhagya Shree Emotional Audience Love Biggest Award

Lenin Success Meet: ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న ‘లెనిన్’ సినిమా సక్సెస్‌మీట్‌ను గుంటూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “గుంటూరులో మొదటి రోజు నుంచే ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంది. ప్రతి షోకు వచ్చిన స్పందన చూసి చాలా ఆనందంగా అనిపించింది. ‘భారతి’ పాత్రను ప్రేక్షకులు తమ సొంత వ్యక్తిలా ఆదరించారు. ఇది నాకు లభించిన అతిపెద్ద అవార్డు. మీ ప్రేమ, విజిల్స్, చప్పట్లకు హృదయపూర్వక ధన్యవాదాలు” అని భాగ్యశ్రీ పేర్కొన్నారు.

ఈ సినిమా డైరెక్టర్ మురళీకిషోర్‌పై ఆమె ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. “మీరు నాకు కేవలం ఒక పాత్ర ఇవ్వలేదు.. ప్రేక్షకుల హృదయాల్లో స్థానం కల్పించారు. హీరోయిన్ పాత్రలను మరింత బలంగా రాయాలని దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు” అంటూ దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. హీరో లెనిన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. “అఖిల్ నువ్వు అద్భుతమైన హీరోవి. భవిష్యత్తులో నీ నుంచి మరెన్నో గొప్ప సినిమాలు రావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. అలాగే నిర్మాతలు నాగార్జున, నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్, చిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చివరగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. “మీరు చూపించిన ప్రేమకు ప్రతిఫలంగా ఇంకా మంచి పాత్రలు చేయడానికి మరింత కష్టపడతాను. మీ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే పాత్రలతో మళ్లీ మీ ముందుకు వస్తాను” అని భాగ్యశ్రీ భావోద్వేగంగా అన్నారు.