July 17, 2026

అర్జెంటీనా vs స్పెయిన్ ఫైనల్ ఫైట్.. భారత్‌లో ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు పూనకాలే!

అర్జెంటీనా vs స్పెయిన్ ఫైనల్ ఫైట్.. భారత్‌లో ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు పూనకాలే!
Reading Time: 2 minutes

అర్జెంటీనా vs స్పెయిన్ ఫైనల్ ఫైట్.. భారత్‌లో ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు పూనకాలే!

Caption of Image.

FIFA World Cup Final: భారతదేశం అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది క్రికెట్ పిచ్చి. కానీ ఒక్కసారి ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) వచ్చిందంటే చాలు.. ఇక్కడి స్పోర్ట్స్ ఫ్యాన్స్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది. క్రికెట్ బ్యాట్ పక్కన పెట్టేసి ఫుట్‌బాల్ జెర్సీలు వేసుకుని రోడ్లపైకి వచ్చేస్తారు. ప్రస్తుతం 2026 ఫిఫా వరల్డ్ కప్ చివరి ఘట్టానికి (ఫైనల్స్) చేరుకోవడంతో భారత్‌లో ఫుట్‌బాల్ ఫీవర్ నెక్స్ట్ లెవెల్ (Next-Level)కి చేరింది.

కేరళ, బెంగాల్‌లో ఫుట్‌బాల్ ఫ్యాన్స్ హంగామా: 
భారత్‌లో ఫుట్‌బాల్ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది కేరళ, పశ్చిమ బెంగాల్ (కోల్‌కతా), గోవా, ఈశాన్య రాష్ట్రాలు (North-East). ఇక్కడ ఫుట్‌బాల్ కేవలం ఆట మాత్రమే కాదు.. ఒక ఎమోషన్. కేరళలోని నదుల్లో, జంక్షన్లలో లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోల 30, 40 అడుగుల భారీ కటౌట్లు గాల్లో తేలుతూ కనిపిస్తాయి. అలాగే ఇష్టమైన జట్ల జెండాల రంగులతో తమ ఇళ్లకు, ఆటోలకు పెయింట్లు వేయించుకుని ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చూపిస్తున్నారు. ప్రతి గల్లీలోనూ పెద్ద పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేసి అర్ధరాత్రి వరకు వందల మంది కలిసి బిర్యానీలు తింటూ మ్యాచ్‌లు చూడటం ఇక్కడ కామన్ గా కనిపిస్తుంది. 

మెట్రో సిటీలలో హ్యాంగ్ ఔట్ వైబ్స్: 
హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాంటి సిటీలలో వరల్డ్ కప్ క్రేజ్ ఒక ట్రెండీగా మారింది. వీకెండ్స్‌లోనే కాదు, వీక్‌డేస్ అర్ధరాత్రి మ్యాచ్‌లు ఉన్నా సరే పబ్‌లు, స్పోర్ట్స్ బార్‌లు ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోతున్నాయి. థియేటర్లలో పెద్ద స్క్రీన్‌లపై మ్యాచ్‌లను లైవ్ టెలికాస్ట్ చేస్తుండటంతో సినిమా రేంజ్‌లో ఫ్యాన్స్ ఈలలు, గోలలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఆఫీస్ బ్రేక్ టైమ్‌లో క్యాంటీన్లలో టీ తాగుతూ.. నిన్న మెస్సీ గోల్ చూశావా?, ఇంగ్లాండ్ కమ్‌బ్యాక్ మామూలుగా లేదుగా! అంటూ జరిగే డిస్కషన్స్ ఆఫీస్ వైబ్‌ను మార్చేస్తున్నాయి.

►ALSO READ | చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. రాహుల్ ద్రవిడ్ రికార్డు బ్రేక్ 

మెస్సీ vs స్పెయిన్ ఫైనల్ వార్: 
జూలై 19న జరగబోయే అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ డ్రీమ్ ఫైనల్ మ్యాచ్ కోసం భారతీయ నెటిజన్లు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను అర్జెంటీనా ఓడించిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లేయర్లు కొట్టుకుంటుంటే.. మెస్సీ చిరునవ్వుతో నిలబడిన విజువల్స్‌పై మీమ్స్ ట్రోలర్లకు ఫుల్ ఫీడ్‌ను ఇస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ స్టేటస్‌లు మొత్తం మెస్సీ జెర్సీలు, స్పెయిన్ పాసింగ్ గేమ్‌ప్లే వీడియోలతో నిండిపోయాయి.

మెస్సీ హిస్టరీ క్రియేట్ చేస్తాడా:
డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా వరుసగా రెండోసారి వరల్డ్ కప్ కొట్టి రికార్డు సృష్టించాలని కళ్లు కాయలు కాసేలా చూస్తోంది. సెమీఫైనల్‌లో రెండు అద్భుతమైన అసిస్ట్‌లతో జట్టును ఫైనల్‌కు చేర్చిన లియోనెల్ మెస్సీ.. ప్రస్తుతం 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ (Golden Boot) రేసులో టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. మెస్సీకి బహుశా ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయ్యే అవకాశం ఉండటంతో, అతని కెరీర్‌కు మరో విశ్వవిజేతగా నిలిచి తన కెరీర్ ముగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

ఈ ఫీవర్ ఇప్పట్లో తగ్గదు: 
క్రికెట్‌కు గుండెకాయ లాంటి భారతదేశంలో ఫుట్‌బాల్ కప్ ఫీవర్ ఈ రేంజ్‌లో ఉండటం క్రీడా ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అర్ధరాత్రులు మేల్కొని మరి గొంతు చించుకుని అరుస్తూ మ్యాచ్‌లు చూస్తున్నారంటే.. ఈ ఫుట్‌బాల్ కిక్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.. జూలై 19న జరిగే చివరి పోరులో మెస్సీ కప్ ముద్దాడుతాడా లేక స్పెయిన్ కొత్త రికార్డు సృష్టిస్తుందా అని భారత్‌లోని కోట్లాది మంది ఫ్యాన్స్ అత్యంత ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. 

 

©️ VIL Media Pvt Ltd.