July 15, 2026

Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్‌తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్‌కు మాస్టర్ స్ట్రాటజీ!

Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్‌తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్‌కు మాస్టర్ స్ట్రాటజీ!
Reading Time: < 1 minute
Nithiin Grand Comeback Three Upcoming Movies After Flops

Grand Comeback: కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న టాలీవుడ్ హీరో నితిన్ ఇప్పుడు భారీ కంబ్యాక్ కోసం పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. వరుస ప్లాప్‌లతో కెరీర్ డెంజర్ జోన్‌లో ఉన్న హీరో నితిన్ ఇప్పుడు ఒకేసారి మూడు విభిన్న ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టి మరోసారి సక్సెస్ బాట పట్టాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్ నుంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా వరకు, అలాగే కొత్త దర్శకుడితో మరో ప్రాజెక్ట్‌ను కూడా ఆయన ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నితిన్ నటిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందట. ఈ చిత్రాన్ని ఏడాది క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు నేచురల్ స్టార్ నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో నితిన్ ఓ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని టాక్. ఈ సినిమా విభిన్నమైన స్టోరీతో తెరకెక్కనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. ఇక ఇదే సమయంలో ‘AAY’ చిత్రంతో గుర్తింపు మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అంజితో కూడా నితిన్ ఒక కొత్త సినిమాకు ఓకే చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను శ్రేష్ఠ్ మూవీస్ నిర్మించనుందని టాక్. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ మూడు సినిమాలపై చిత్రబృందాల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ నితిన్ వరుసగా మూడు సినిమాలతో బలమైన కంబ్యాక్‌కు సిద్ధమవుతున్నారనే వార్తలు ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ఈ ట్రిపుల్ లైనప్ నితిన్‌ను మరోసారి టాలీవుడ్ టాప్ రేస్‌లో నిలబెడుతుందా లేదా అనేది చూడాలి.