July 17, 2026

జెన్కో కార్యాలయాల వద్ద ధర్నాలు, ర్యాలీలు నిషేధం :హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్ డైరెక్టర్ రాజు

జెన్కో కార్యాలయాల వద్ద ధర్నాలు, ర్యాలీలు నిషేధం :హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్ డైరెక్టర్ రాజు
Reading Time: < 1 minute

జెన్కో కార్యాలయాల వద్ద ధర్నాలు, ర్యాలీలు నిషేధం :హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్ డైరెక్టర్ రాజు

Caption of Image.
  •     హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్ డైరెక్టర్ రాజు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పవర్​జనరేషన్​ సంస్థ (జెన్​కో) కార్యాలయాలు, పవర్​ జనరేటింగ్​స్టేషన్ల పరిధిలో ఉద్యోగులు ఎలాంటి ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు నిర్వహించరాదని సంస్థ హెచ్ఆర్​డైరెక్టర్​కుమార్​రాజు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని విద్యుత్ సౌధతో పాటు ఇతర జెన్​కో కార్యాలయాలు, పవర్ జనరేటింగ్ స్టేషన్లు, ఈఆర్‌‌‌‌‌‌‌‌పి ప్రాంగణాల్లో నినాదాలు చేయడం, గుమిగూడడం, ప్రదర్శనలు లేదా ర్యాలీలు నిర్వహించడంపై పూర్తి నిషేధం విధించినట్టు ఆయన ప్రకటించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రదర్శనలు, నినాదాలు, ర్యాలీలలో పాల్గొనే ఉద్యోగులపై సంస్థాగత నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.  

©️ VIL Media Pvt Ltd.