July 14, 2026

2028 జూన్ 2 నాటికి.. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులు పూర్తి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

2028 జూన్ 2 నాటికి.. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులు పూర్తి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Reading Time: < 1 minute

2028 జూన్ 2 నాటికి.. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులు పూర్తి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

Caption of Image.

వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు సహకారం అందిస్తామని  కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.   2028 జూన్ 2 నాటికి మమూనూరు, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు పనులను పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం అని చెప్పారు.  వరంగల్ మమునూరు ఈ ప్రాజెక్టు విస్తరణకు సంబంధించి ఇప్పటికే 253 ఎకరాల భూమిని సేకరించి, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించారని చెప్పారు. రాబోయే మూడు, నాలుగు రోజుల్లోనే ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుందని తెలిపారు

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘ఉడాన్’ (UDAN) స్కీమ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా వంద విమానాశ్రయాలను నిర్మించే ప్రక్రియ జరుగుతుందన్నారు ఇందులో భాగంగా, తెలంగాణలోని పలు ఎయిర్ పోర్టుల అభివృద్ధిపై ఉన్నత స్థాయి చర్చలు జరిపామన్నారు. మరోవైపు ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు  విమానాశ్రయ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 1500 ఎకరాల భూమిని ఇచ్చేందుకు సిద్ధమైందన్నారు రామ్మోహన్ నాయుడు. 

తెలంగాణ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని  సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజల ప్రయోజనాల కోసమే తాను ఇన్నిసార్లు ఢిల్లీకి వస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు, చర్చల ద్వారానే రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు.

ALSO READ : రెండేండ్లలో దేవాదుల పూర్తి చేసి..6 లక్షల ఎకరాలకు నీళ్లిస్తం

ఢిల్లీ పర్యటనలో భాగంగా వరంగల్ మమూనూరు, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణను 2034 నాటికి ‘వన్ ట్రిలియన్ డాలర్ల’ ఎకానమీగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని,   ప్రాంతీయ ఎయిర్ పోర్టుల అభివృద్ధి అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 

©️ VIL Media Pvt Ltd.