July 17, 2026

జ్యోతిష్యం:చీకటి పడిన(సూర్యాస్తమయం)తరువాత ఈ వస్తువులు కొన్నారా.. కష్టాలు కొని తెచ్చుకున్నట్టే..!

జ్యోతిష్యం:చీకటి పడిన(సూర్యాస్తమయం)తరువాత ఈ వస్తువులు కొన్నారా.. కష్టాలు కొని తెచ్చుకున్నట్టే..!
Reading Time: 2 minutes

జ్యోతిష్యం:చీకటి పడిన(సూర్యాస్తమయం)తరువాత ఈ వస్తువులు కొన్నారా.. కష్టాలు కొని తెచ్చుకున్నట్టే..!

Caption of Image.

 మీరు చాలా కష్టపడుతన్నారా.. మంచి జీతం.. విలాసవంతమైన జీవితం ఉన్నా కాని ఏదో లోటు ఉందా.. కష్టాలు .. బాధలు వెంటాడుతున్నాయా.. అయితే మీరు చీకటి పడిన తరువాత ఈ వస్తువులు కొంటున్నారా.. అదే కారణమంటున్నారు జ్యోతిష్య పండితులు. మరి చీకటి పడిన తరువాత అంటే సూర్యాస్తమయం తరువాత ఎలాంటి వస్తువులు కొనకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . 

భారతీయులు.. సంప్రదాయాలకు.. ఆచారాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు.  జ్యోతిష్యం ప్రకారం… కొన్ని వస్తువులను ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి తెచ్చుకోకూడదు.. కొనకూడదు… అయితే చీకటి పడిన తరువాత (సూర్యాస్తమయం) ఉప్పు.. చీపురు.. ఆవనూనె.. నల్లనువ్వులు.. పాలు.. ఇనుప వస్తువులు వంటి వాటిని కొనకూడదని.. ఎప్పుడో కొని షాపులో ఉంచినా.. ఆ సమయంలో ఇంటికి తెచ్చుకోకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

ప్రస్తుత జీవన విధానం బిజీ లైఫ్​ అయింది.  చాలామంది..ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే సమయంలోకాని.. ఇంటికి వచ్చిన తరువాత కాని రాత్రి సమయంలో కాని నిత్యవసరాలు కొనుగోలు చేస్తుంటారు. పురాణాల ప్రకారం..  సాయంత్రం వేళ ఇంటికి శ్రీ మహాలక్ష్మి వస్తుందని భావిస్తారు. ఆ సమయంలో కొన్ని వస్తువులు   సానుకూల శక్తి తగ్గి, ఆర్థిక ఇబ్బందులు, అశాంతి కలుగుతుందని పండితులు చెబుతున్నారు

సాయంత్రం తర్వాత కొనకూడని వస్తువులు

ఉప్పు:  దీనిని సంస్కృతంలో లవణం అంటారు.  సాధారణంగా ఉప్పు అనే పదాన్ని ఇంటిలో ఉపయోగించరు.  పూర్వకాలంలో భోజనాలలో వడ్డించేటప్పుడు లవణం అనే వాడేవారు.  జ్యోతిష్య.. వాస్తు సిద్దాంతం ప్రకారం… ఈ పదార్దానికి చాలా శక్తి ఉంటుంది.  అందుకే దిష్టి తగిలిందని భావిస్తే ఉప్పును తల చుట్టూ తిప్పి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేస్తారు.  సూర్యాస్తమయం తరువాత దీనిని కొనడం వలన ధన నష్టం.. అనవసర ఖర్చులు పెరిగి .. సంపాదించిన డబ్బు నిలవదు.  ఆర్థిక ఇబ్బందులతో ఆందోళన.. ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  అందుకే ఉప్పును ఎట్టి పరిస్థితిలో సాయంత్రం సమయంలో కొనకూడదు.. ఇంటికి తీసుకురాకూడదని పండితులు చెబుతున్నారు. 

ఆవనూనె: జ్యోతిష్యం ప్రకారం ఆవనూనెతో శని భగవానుడికి ప్రత్యేక సంబంధం ఉంది. దీనిని సాయంత్రం ఇంటికి తెచ్చుకుంటే ఆర్థిక కష్టాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.  అందుకే దీనిని పగటివేళలో మాత్రమే కొనాలని పండితులు చెబుతున్నారు. 

చీపురు:  ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది.  పురాణాల ప్రకారం దీనిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.  సూర్యాస్తమంలో సహజంగా శ్రీ మహాలక్ష్మి దేవి ఇంటిలోకి వస్తుంది.  ఆ సమయంలో ..చీపురును కొనడం  ఇంటికి తీసుకురావడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.  లక్ష్మీదేవిని.. డబ్బుతో కొని ఇంటికి తెచ్చుకోవడం వలన అరిష్టాలు జరుగుతాయి.  మనం అమ్మవారిని కొనలేం కదా..! అందుకే ఎట్టి పరిస్థితిలో సాయంత్రం చీపురును ఇంట్లోకి తీసుకురాకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

నల్ల నువ్వులు: నల్ల నువ్వులను  పితృకర్మలు, శని పూజలకు ఉపయోగిస్తారు. సాయంత్రం తర్వాత నల్ల నువ్వులు కొనడం వల్ల శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. సాయంత్రం నల్లనువ్వులను కొని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లోకి శనిభగవానుడిని ఆహ్వానించేనట్టేనని పురాణాల ద్వారా తెలుస్తుంది. 

పాలు.. పెరుగు:  ఇవి చంద్రునికి సంబంధించిన వస్తువులు.. సూర్యస్తమయం తరువాత  చంద్రుడు ఉదయిస్తాడు. ఇవి చంద్రుని  ఐశ్వర్యానికి ప్రతీకలని జ్యోతిష్యశాస్త్రంలో ఉంది.సాయంత్రం చంద్రునికి ఆహారంగా ఉంటాయి.  మనం వీటిని సాయంత్రం అంటే చంద్రోదయం సమయంలో వీటిని ఇంటికి తెచ్చుకుంటే చంద్రునికి ఆగ్రహం వస్తుంది.  అందువలన సాయంత్రం పాలు… పెరుగు కొనకూడదని పండితులు చెబుతున్నారు. అయితే డబ్బులు ఇవ్వకుండా  వాటిని తీసుకొచ్చి.. ముందుగా చంద్రునికి నమస్కారం చేసి ఆ తరువాత ఇంట్లోకి తీసుకెళ్లాలని పండితులు చెబుతున్నారు. 

ఇనుప వస్తువులు.. సిమెంట్​:  ఇనుము శని గ్రహానికి సంబంధించినదిగా భావిస్తారు. సూర్యాస్తమయం తర్వాత ఇనుప పాత్రలు, పనిముట్లు, ఇనుప వస్తువులు .. సిమెంట్​ కొనడం శుభప్రదం కాదని పండితులు చెబుతున్నారు.  అలాగే శనివారం శని భగవానుడికి చాలా ఇష్టమైన రోజు.  ఈ వస్తువులు శనివారం ఈ వస్తువుల దగ్గర శని భగవానుడు ఉంటాడు.  అందుకే శనివారం కూడా వీటిని కొనకూడదు.  అందుకే వీటిని పగటివేళల్లో.. శనివారం కాకుండా.. మిగతా రోజుల్లో మాత్రమే కొనడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.