అయితే ఈ స్థాయి భారీ బిజినెస్ జరగడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలవాలంటే దాదాపు రూ. 400 నుండి రూ. 425 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. రామ్ చరణ్ గత చిత్రాలైన ‘ఆచార్య’, ‘గేమ్ చేంజర్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేక నిరాశపరిచాయి. దీంతో ఈ ‘పెద్ది’ చిత్రం ఫలితంపై మెగా అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. చరణ్ ఈ సినిమాతో ఖచ్చితంగా గట్టి కంబ్యాక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు చాలా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఇప్పటికే  విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కి రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ట్రేడ్ అంచనా ప్రకారం.. ఈ సినిమా మొదటి రోజే వరల్డ్‌వైడ్‌గా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. జూన్ 4న థియేటర్లలోకి రాబోతున్న ఈ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి!