Reading Time: 5 minutes

RCB vs GT మధ్య ఫైనల్ ఫైట్.. లైవ్ అప్డేట్స్ మీకోసం.. 

Caption of Image.

RCB vs GT: 
* గుజరాత్ పై ఆర్సీబీ ఘన విజయం
* 5 వికెట్ల తేడాతో గెలిచిన ఆర్సీబీ
* బ్యాక్ టు బ్యాక్ కప్పు కొట్టిన బెంగళూరు
* అద్భుతమైన ఇన్సింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ
* కిరాక్ బౌలింగ్ తో గుజరాత్ ని దెబ్బకొట్టిన ఆర్సీబీ

RCB vs GT: 
* ఐదో వికెట్ నష్టపోయిన ఆర్సీబీ
* టిమ్ డేవిడ్ (24)ని ఔట్ చేసిన అర్సద్ ఖాన్
* క్రీజులో ఉన్న హాఫ్ సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ
* ఆర్సీబీ గెలవడానికి 36 బంతుల్లో 24 రన్స్ చేయాలి

 

RCB vs GT: 
* హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ
* 25 బంతుల్లోనే 52 పరుగులు కొట్టిన కింగ్ కోహ్లీ
* 2 సిక్సులు, 7 బౌండరీలతో చెలరేగిన విరాట్
* నాలుగో ఐపీఎల్ హాఫ్ సెంచరీ కొట్టిన కోహ్లీ
* కోహ్లీ ఐపీఎల్ లో హిస్టరీలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
* ఆర్సీబీ గెలవడానికి 50 బంతుల్లో 41 రన్స్ కొట్టాలి 

 

RCB vs GT: 
* 100 రన్స్ పూర్తి చేసుకున్న గుజరాత్ టైటాన్స్
* బ్యాటింగ్ లో చెలరేగిపోతున్న విరాట్ కోహ్లీ
* గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడుతున్న కింగ్ కోహ్లీ
* ఆర్సీబీ గెలవడానికి 60 బంతుల్లో 56 రన్స్ కొట్టాలి

 

RCB vs GT: 
* వరుసగా వికెట్లు కోల్పోతున్న ఆర్సీబీ
* కృనాల్ పాండ్యాని LBW ఔట్ చేసిన రషీద్ ఖాన్
* ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన రషీద్

RCB vs GT: 
* ఇబ్బందుల్లో పడిన బెంగళూరు
* 89 పరుగులకే మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
* కెప్టెన్ రజత్ పాటిదార్ (15)ని ఔట్ చేసిన రషీద్ ఖాన్
* ఆర్సీబీ గెలవడానికి 70 బంతుల్లో 67 రన్స్ కొట్టాలి

RCB vs GT: 
* మరో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
* రబాడ బౌలింగ్ లో దేవదత్ పడిక్కల్ క్యాచ్ ఔట్
* పర్పుల్ క్యాప్ ని దక్కించుకున్న కగిసో రబాడ
* ఆర్సీబీ గెలవడానికి 88 బంతుల్లో 93 పరుగులు చేయాలి 

 

RCB vs GT: 
* దూకుడుగా ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్ ఔట్
* సిరాజ్ బౌలింగ్ లో వెంకటేశ్ అయ్యర్(32) క్యాచ్ ఔట్
* గుజరాత్ టైటాన్స్ కి మొదటి వికెట్ అందించిన సిరాజ్

 

RCB vs GT: 
* చితక్కొట్టుడు కొడుతున్న విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్
* 50 రన్స్ పూర్తి చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
* కగిసో రబాడ బౌలింగ్ లో 4, 4, 6, 4, 1, 0లతో 19 రన్స్ సాధించిన ఆర్సీబీ

RCB vs GT: 
* బ్యాటింగ్ లో చెలరేగిన వెంకటేశ్ అయ్యర్
* కగిసో రబాడ బౌలింగ్ లో దంచికొట్టిన అయ్యర్
* 2 ఓవర్లో 4, 0, 6, 4, 0, 4లతో 18 రన్స్ సాధించిన వెంకటేశ్
* ఆర్సీబీ గెలవడానికి 108 బంతుల్లో 133 రన్స్ కొట్టాలి

 

RCB vs GT: 
* ఫైనల్ పోరులో స్వల్ప అంతరాయం  
* సిరాజ్ వేసిన ఫస్ట్ బంతికి గాయపడిన వెంకటేశ్ అయ్యర్
* వెంకటేశ్ అయ్యర్ ని చెక్ చేస్తున్న ఫిజియో
* నొప్పితో ఇబ్బంది పడుతున్న అయ్యర్ 

RCB vs GT: 
* టార్గెట్ ఛేదనకు దిగిన ఆర్సీబీ
* బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి వచ్చిన కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్
* గుజరాత్ తరపున ఫస్ట్ ఓవర్ బౌలింగ్ చేస్తున్న మహమ్మద్ సిరాజ్

RCB vs GT: 
* 155 పరుగులకే పరిమితమైన గుజరాత్ టైటాన్
* హాఫ్ సెంచరీతో రాణించిన వాష్టింగన్ సుందర్
* గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఆర్డర్ ని కుప్పకూల్చిన ఆర్సీబీ బౌలర్లు
* 3 వికెట్లతో చెలరేగిన రసిఖ్ సలామ్ దార్, తలో రెండు వికెట్లు తీసిన భూవీ, హేజిల్ వుడ్ 

RCB vs GT: 
* హాఫ్ సెంచరీ చేసిన వాషింగ్టన్ సుందర్
* 37 బంతుల్లో 50 పరుగులు చేసిన వాషింగ్టన్
* ఇప్పటి వరకు మూడు హాఫ్ సెంచరీలు చేసిన సుందర్

 

RCB vs GT: 
* 8వ వికెట్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్
* రషీద్ ఖాన్ ని ఔట్ చేసిన రసిఖ్ దార్
* ఈ మ్యాచ్ లో 3 వికెట్లు పడగొట్టిన సలమ్ దార్
* 151 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన గుజరాత్

 

RCB vs GT: 
* గుజరాత్ టైటాన్స్ ని ఒత్తిడిలోకి నెట్టిన ఆర్సీబీ
* జేసన్ హోల్డర్ (7)ని ఔట్ చేసిన భువనేశ్వర్ కుమార్
* పర్పల్ క్యాప్ రేసులో నెంబర్ వన్ స్థానానికి చేరిన భువీ

 

RCB vs GT: 
* మరోసారి నిరాశపర్చిన రాహుల్ తెవాటియా
* 7 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరిన తెవాటియా
* రసిఖ్ దార్ సలామ్ బౌలింగ్ లో రాహుల్ క్యాచ్ ఔట్
* 115 పరుగులకే కీలకమైన 6 వికెట్లు కోల్పోయిన గుజరాత్

 

RCB vs GT: 
* ఎట్టకేలకు 100 రన్స్ కంప్లీట్ చేసుకున్న గుజరాత్
* 14. 3 ఓవర్లలో 102 పరుగులు సాధించిన టైటాన్స్
* ఫైనల్ ప్రెజర్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు
* ఇప్పటికే 5 వికెట్లని నష్టపోయిన గుజరాత్ టైటాన్స్

 

RCB vs GT: 
* అద్భుతంగా ఆడుతున్న అర్షద్ ఖాన్ ఔట్
* 15 పరుగులకే జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్ లో అర్షద్ ఔట్
* 99 పరుగుల వద్దే వికెట్ నష్టపోయిన గుజరాత్ టైటాన్స్

 

RCB vs GT: 
* ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడి చేస్తున్న అర్షద్ ఖాన్
* జాకబ్ డఫీ బౌలింగ్ లో 4, 4, 1, 6, 1, 0తో 16 రన్స్ సాధించిన అర్షద్
* ఒకవైపు వికెట్లు పడినప్పటికీ క్రమంగా పెరుగులున్న గుజరాత్ టైటాన్స్ స్కోరింగ్ రేట్

RCB vs GT: 
* బిగ్ ట్రబుల్ లో గుజరాత్ టైటాన్స్
* నిలకడగా రాణిస్తున్న జోస్ బట్లర్(19) ఔట్
* 73 పరుగులకే 4 వికెట్లు నష్టపోయిన గుజరాత్
* నిప్పులు చేరిగే బంతులతో గుజరాత్ పతనాన్ని శాసిస్తున్న ఆర్సీబీ బౌలర్లు
* ఆర్సీబీ నినాదాలతో మార్మోగుతున్న నరేంద్ర మోడీ స్టేడియం

 

RCB vs GT: 
* గుజరాత్ జట్టుకి బిగ్ రిలీఫ్
* వాషింగ్టన్ సుందర్ క్యాచ్ డ్రాప్
* వాషీ ఇచ్చిన క్యాచ్ వదిలి పెట్టిన జోర్డాన్ కాక్స్

 

ఐపీఎల్ నాకౌట్స్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడింది వీళ్లే: 
* మహేంద్ర సింగ్ ధోనీ– 28
* రవీంద్ర జడేజా– 25 
* రవిచంద్రన్ అశ్విన్– 24
* సురేష్ రైనా– 24
* రోహిత్ శర్మ– 23
* అంబటి రాయుడు– 23
* డ్వేన్ బ్రావో– 19
* విరాట్ కోహ్లీ19*

RCB vs GT: 
* మరో వికెట్ నష్టపోయిన గుజరాత్
* తీవ్ర ఇబ్బందుల్లో పడిన గుజరాత్ టైటాన్స్
* రసిఖ్ సలాం దార్ బౌలింగ్ లో నిశాంత్ సింధు ఔట్
* భారీ షాట్ కోసం వెళ్లి ఔటైన గుజరాత్ బ్యాటర్ నిశాంత్
* 8.1 ఓవర్ లో 3 వికెట్లు కోల్పోయిన 55 రన్స్ చేసిన గుజరాత్

RCB vs GT:
* 50 రన్స్ పూర్తి చేసుకున్న గుజరాత్ టైటాన్స్
* పవర్ ప్లేలోనే 2 వికెట్లు కోల్పోయిన గుజరాత్
* ఓపెనర్లు ఇద్దరినీ పెవిలియన్‌కు పంపిన ఆర్సీబీ బౌలర్లు
 

RCB vs GT: 
* వరుసగా వికెట్లు కోల్పోతున్న గుజరాత్
* భువి బౌలింగ్ లో సాయి సుదర్శన్ క్యాచ్ ఔట్
* 26 రన్స్ కి రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్

GT vs RCB: 
* IPL ఫైనల్ లో గుజరాత్ కి బిగ్ షాక్
* 22 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ 
* 10 రన్స్ కొట్టి గిల్ ఔట్

* RCB vs GT:
* ఐపీఎల్ ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ వర్సెస్ బెంగళూరు
* బ్యాటింగ్ చేసేందుకు స్టేడియంలోకి వచ్చిన సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఫస్ట్ ఓవర్ బౌలింగ్ చేస్తున్న  జాకబ్ డఫీ

* ఐపీఎల్ ఫైనల్స్‌లో టాస్ ప్రభావం: ఐపీఎల్ లో ఇప్పటి వరకు టాస్ గెలిచిన జట్లు 10 సార్లు ట్రోఫీని గెలుచుకున్నాయి.. -టాస్ ఓడిపోయిన జట్లు కూడా 8 సార్లు ఛాంపియన్‌లుగా అవతరించాయి.

ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ :
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (కీపర్), రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్, జాకబ్ డఫీ.

* గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, నిశాంత్ సింధు, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడ, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్
 

RCB vs GT:
* టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆర్సీబీ.. 
* మొదట బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి రానున్న గుజరాత్ టైటాన్స్
* అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ పోరు
* పాత జట్టుతోనే బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

 

* 200+ స్కోరు చేస్తే గెలవడం పక్కా: గత 18 ఏళ్ల చరిత్రలో ఏ ఐపీఎల్ ఫైనల్‌లోనూ 200+ స్కోరును ఛేజ్ చేయలేదు.. అంటే 200+ పరుగులు చేస్తే గెలవడం ఖాయం.. 2008 నుంచి 2025 వరకు జరిగిన అన్నీ ఫైనల్స్‌లో నాలుగు సార్లు 200+ స్కోర్లు నమోదయ్యాయి, కానీ అవి ఎప్పుడూ ఛేజ్ చేయలేకపోయారు.. 

* తొలి క్వాలిఫయర్ గెలిచిన జట్టుదే ట్రోఫీ?: గత 8 ఫైనల్స్‌లోనూ క్వాలిఫయర్ 1లో గెలిచిన జట్టే విజయం సాధించింది. 2016 నుంచి అన్ని ఫైనల్స్ కూడా క్వాలిఫయర్ 1లో ఆడిన జట్ల మధ్యే పోటీ కొనసాగింది. 2016లో మాత్రం హైదరాబాద్ ఎలిమినేటర్‌లో గెలిచి ఛాంపియన్‌గా అవతరించి చరిత్ర నెలకొల్పింది. 

* కాసేపట్లో టాస్: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ కాసేపట్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. రాత్రి 7 గంటలకి టాస్ పడనుండగా, రాత్రి 7: 30 గంటలకి మ్యాచ్ ప్రారంభమైతుంది..
 

* ఫైనల్ పోరుకు సిద్ధం: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ కాసేపట్లో అహ్మదాబాద్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరగబోతుంది.. 

 

RCB vs GT IPL 2026 Final Live Updates: IPL 2026 ఫైనల్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు తలో ఒకసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాయి. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథిగా తన మొదటి టైటిల్ కొట్టాలని కసిగా ఉంటే, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా రెండు ట్రోఫీలు గెలిచిన మూడో కెప్టెన్‌గా రికార్డు సృష్టించాలని చూస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించిన మరింత సమాచారం కోసం V6 తెలుగు న్యూస్ ఛానెల్ ని చూస్తునే ఉండండి..  

©️ VIL Media Pvt Ltd.