Reading Time: < 1 minute
Cm Revanth Reddy Alerts Officials Amid Heavy Rain Forecast In Telangana

CM Revanth: రాష్ట్రంలో వర్షసూచన నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వాతావరణ శాఖ సూచనల మేరకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను కోరారు. ధాన్యం తరవకుండా టార్పాలెన్స్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు పూర్తైన కేంద్రాల నుండి ధాన్యం ఉన్న కొనుగోలు కేంద్రాలకు టార్పాలెన్లు పంపండని సూచించారు. సీఎం రేవంత్ రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇకపోతే గతరాత్రి నుండి హైదరాబాద్ నగరం సహా రాష్ట్రాల్లోని పలు జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతికొచ్చిన పంట కళ్ళముందే తడిసి ముద్దవుతుంటే బోరున విలవిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే రాష్ట్రంలోని అనేక జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.