Reading Time: < 1 minute

హైవేపై ఆటో రిక్షా, ట్రాక్టర్ ఢీకొని ఆరుగురు మహిళలు స్పాట్ డెడ్.. ముగ్గురి పరిస్థితి విషమం

Caption of Image.

లక్నో: ఉత్తరప్రదేశ్‎లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బదౌన్ జిల్లాలో బుధవారం (జూన్ 17) మధ్యాహ్నం బరేలీ-మధుర హైవేపై ట్రాక్టర్, ఆటో రిక్షా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. పెళ్లికి బంధువులను ఆహ్వానించడానికి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మహిళలు ఆటో రిక్షాలో గర్హౌనా గ్రామానికి ప్రయాణిస్తుండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. 

పోలీసుల వివరాల ప్రకారం.. మురవాన్ నగ్లా గ్రామానికి చెందిన దల్చంద్ మౌర్య కుమారుడి పెళ్లి జూన్ 29న జరగనుంది. ఈ వివాహానికి బంధువులను ఆహ్వానించేందుకు దల్చంద్ ఫ్యామిలీకి చెందిన ఎనిమిది మంది మహిళలు గర్హౌనా గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో బరేలీ-మధుర హైవేపై వీరు ప్రయాణిస్తోన్న ఆటో రిక్షా ముందు ఉన్న ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేయబోయే క్రమంలో ఎదురుగా వేగంగా వస్తున్న మరో ట్రాక్టర్ దానిని ఢీకొట్టింది. 

►ALSO READ | ‘‘అసలు వీడు మనిషేనా..? పసికందును గాల్లోకి విసిరేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు.. ఇదేం శాడిజం? ’’

ఈ ఘటనలో అక్కడికక్కడే ఆరుగురు మహిళలు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను ప్రేమ దేవి (32), గంగాశ్రీ అలియాస్ సరళ (32), రాజకుమారి (50), రేవతి (80), నారాయణి (30), ఆర్తి (30)గా గుర్తించారు. 

మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఆటో రిక్షా డ్రైవర్ శని, మరో ఇద్దరు మహిళలు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో 10 రోజుల్లో పెళ్లి పెళ్లిభాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పుల శబ్ధంతో తీవ్ర విషాదం నెలకొంది. 

©️ VIL Media Pvt Ltd.