Reading Time: < 1 minute
Jagapathi Babu Completes Dubbing Appalasuri Character Ram Charan Peddi Movie Release

Jagapathi Babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’. ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీలో కీలకమైన ‘అప్పలసూరి’ పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు జగపతి బాబు తన డబ్బింగ్‌ను పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఒక ఇంటెన్స్ డబ్బింగ్ వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకోగా.. అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది.

జగ్గు భాయ్ షేర్ చేసిన ఈ వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అప్పలసూరి పాత్ర కోసం ఆయన డబ్బింగ్ చెబుతూ చూపించిన హావభావాలు, పలికిన భావోద్వేగ డైలాగులు థియేటర్లలో ఏ రేంజ్ రచ్చ ఉండబోతుందో హింట్ ఇస్తున్నాయి. ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. డబ్బింగ్‌లో జగ్గు భాయ్ చూపించిన ఇంటెన్సిటీకి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. “అప్పలసూరి క్యారెక్టర్ సినిమాలో నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మేకర్స్‌ గతంలో ఈ సినిమాలో జగపతి బాబు పోషిస్తున్న ‘అప్పలసూరి’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు సోషల్ మీడియాలో ఆ లుక్ ఎంత వైరల్ అయిందో తెలిసిన విషయమే. నిజానికి ఎప్పుడూ స్టైలిష్ విలన్‌గానో లేదా క్లాస్ తండ్రి పాత్రల్లోనో కనిపించే జగపతి బాబు, ఈ సినిమాలో ఊహించని మేకోవర్‌తో ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. చెదిరిన జుట్టు, ఒత్తైన గడ్డం, దారంతో కట్టిన విరిగిన కళ్లజోడుతో ఒక రా అండ్ ఇంటెన్సివ్ లుక్‌లో కనిపించారు. తాజాగా ఆయన ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను పూర్తి చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.