Reading Time: < 1 minute
Samantha Maa Inti Bangaram Movie Release Date Clash With Thalapathy Vijay Jananayagan

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత చాలా కాలం తర్వాత నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’కి చిక్కులు తప్పడం లేదు. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకున్న ఈ సినిమాను ఎప్పుడో విడుదల చేయాలి కానీ ఐపీఎల్, పెద్ది లాంటి కొన్ని కారణాలతో వాయిదా వేసి అఫీషియల్‌గా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, సమంత మూవీకి బాక్సాఫీస్ వద్ద ఇప్పుడొక ఊహించని భారీ ముప్పు పొంచి ఉంది. విజయ్ కెరీర్‌లో చివరి సినిమాగా ప్రచారం చేసిన మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘జననాయగన్’కూడా అదే జూన్ 19వ తేదీని టార్గెట్ చేసినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా బజ్ నడుస్తోంది.

దళపతి విజయ్ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇస్తుండటంతో, ఆయన సినీ కెరీర్‌లో ఇదే చివరి సినిమా కానుంది. దీంతో ‘జననాయగన్’ సినిమాపై కేవలం కోలీవుడ్‌లోనే కాకుండా, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కంటెంట్ పరంగా, బిజినెస్ పరంగా మైండ్ బ్లోయింగ్ క్రేజ్ ఉంది. విజయ్ లాస్ట్ ఫిల్మ్ కావడంతో తెలుగు డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి పోటీ పడుతున్నారు. ఒకవేళ దళపతి విజయ్ ‘జననాయగన్’ అధికారికంగా జూన్ 19నే థియేటర్లలోకి వస్తే.. సమంత ‘మా ఇంటి బంగారం’కి థియేటర్ల లభ్యత మరియు ఓపెనింగ్స్ పరంగా గట్టి పోటీ ఎదురవక తప్పదు. నందినీ రెడ్డి మార్క్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు లాంగ్ రన్ ఉండే ఛాన్స్ ఉన్నప్పటికీ, మాస్ ఎలిమెంట్స్‌తో వస్తున్న విజయ్ చిత్రం ముందు థియేటర్లను హోల్డ్ చేయడం కాస్త కష్టమైన పనినే.