Reading Time: < 1 minute
Lic Launches Two New Jeevan Sathi Plans Check Features Benefits And Premium Details

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా “జీవన్ సాథి” బ్రాండ్ కింద రెండు కొత్త సేవింగ్స్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ప్రకటించింది. LIC న్యూ జీవన్ సాథీ- సింగిల్ ప్రీమియం’, ‘LIC న్యూ జీవన్ సాథీ- లిమిటెడ్ ప్రీమియం’ పేర్లతో ఈ కొత్త పాలసీలను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ రెండు ప్లాన్‌లు నాన్-పార్, నాన్-లింక్డ్, వ్యక్తిగత సేవింగ్స్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లుగా రూపొందించారు.

మార్కెట్ రిస్క్‌కు సంబంధం లేకుండా స్థిరమైన రాబడులు పొందాలనుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని LIC ఈ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. మారుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సేవింగ్స్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడమే ఈ కొత్త ప్లాన్‌ల లక్ష్యమని LIC వెల్లడించింది. కస్టమర్లకు ప్రీమియం చెల్లింపుల్లో మరింత సౌలభ్యం కల్పించేందుకు రెండు వేరియంట్లు తీసుకొచ్చినట్లు తెలిపింది.

జూన్ 1 నుంచి అందుబాటులోకి

LIC ప్రకటన ప్రకారం, ఈ రెండు కొత్త ప్లాన్‌లు 2026 జూన్ 1 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. భారతీయ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ఉత్పత్తులను రూపొందించినట్లు సంస్థ తెలిపింది.

రెండు ప్లాన్‌ల ప్రత్యేకతలు

1. New Jeevan Sathi – Single Premium

ఒక్కసారిగా ప్రీమియం చెల్లించే విధానం
దీర్ఘకాల సేవింగ్స్‌తో పాటు లైఫ్ కవర్
మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం ఉండదు
స్థిరమైన ప్రయోజనాలు పొందే అవకాశం

2. New Jeevan Sathi – Limited Premium

పరిమిత కాలం వరకు మాత్రమే ప్రీమియం చెల్లించే సౌకర్యం
కుటుంబ భద్రతతో పాటు సేవింగ్స్ ప్రయోజనం
ఫైనాన్షియల్ ప్లానింగ్‌కు అనుకూలంగా రూపొందించారు

ఎవరికీ ఉపయోగకరం?

దీర్ఘకాల సేవింగ్స్ కోరుకునేవారికి
మార్కెట్ రిస్క్ లేకుండా గ్యారంటీ బెనిఫిట్స్ కోరుకునే వారికి
కుటుంబ భద్రతతో పాటు సేవింగ్స్ ప్లాన్ వెతుకుతున్న వారికి
రిటైర్మెంట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకునే వారికి ఈ ప్లాన్‌లు ఉపయోగపడే అవకాశం ఉంది.