Reading Time: < 1 minute
Tharun Bhascker Gayapadda Simham Movie Ott Streaming Details Amazon Prime

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘గాయపడ్డ సింహం’ (Gayapadda Simham). కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ కామెడీ స్పూఫ్ డ్రామా.. ప్రమోషన్స్‌తో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న, ఆడియన్స్‌ను మెప్పించే బలమైన కంటెంట్ లేకపోవడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఊహించని విధంగా డిజప్పాయింట్మెంట్‌నే మిగిల్చింది. థియేట్రికల్ రన్ త్వరగానే ముగిసిపోవడంతో, ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుని ఆడియన్స్ ముందుకు తెచ్చేసింది.

కాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ఇవాళ్టి నుంచే (మే 22, 2026) అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న యూజర్లు అందరూ ఇంట్లోనే కూర్చుని ఈ వీకెండ్‌లో ప్రశాంతంగా ఈ కామెడీ స్పూఫ్ డ్రామాను వీక్షించవచ్చు. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్‌తో పాటు ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో, వర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి (JD Chakravarthy) ఒక కీలక పాత్రలో నటించడం విశేషం. సప్త అశ్వ మీడియా వర్క్స్.. జీ స్టూడియోస్ (Zee Studios) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఓటీటీలో ఒకసారి ట్రై చేయవచ్చు.