Reading Time: < 1 minute
Jr Ntr Prashanth Neel Dragon Movie First Glimpse Released Birthday Special

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్‌ని రివీల్ చేయడమే కాదు, సుమారు నాలుగు నిమిషాల నిడివిగల ఒక పూర్తిస్థాయి ట్రైలర్ లాంటి గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేసింది సినిమా టీమ్.

మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేయగా, ఈ గ్లింప్స్ మొత్తం సినిమా కంటెంట్ ఎలా ఉండబోతోంది అనే విషయం మీద క్లారిటీ ఇచ్చేసినట్లు అయింది. ‘సలార్’, ‘కేజీఎఫ్’ సిరీస్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్, తన మార్క్ ఏమాత్రం తగ్గకుండానే ఈ గ్లింప్స్ కట్ చేశాడు.

మొత్తం మీద గ్లింప్స్ చూస్తుంటే మాత్రం, ఎన్టీఆర్ – నీల్ సినిమా అయిన ‘డ్రాగన్’ మీద ఒక్కసారిగా అంచనాలు ఏర్పడేలా చేసింది. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉంది, కానీ షూట్లు వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో, వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
మరి ఇంకెందుకు ఆలస్యం, తాజాగా సినిమా టీమ్ రిలీజ్ చేసిన ఆ వీడియో మీరు కూడా చూసేయండి.