Reading Time: < 1 minute

విజయ్ ను సీఎం చేయండి.. అడ్డుకోవాల్సిన అవసరం లేదు: స్టాలిన్

Caption of Image.

తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేస్తామని అతిపెద్దపార్టీ టీవీకే ఇప్పటికే గవర్నర్ ను  కోరగా ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే.అయితే మరోసారి  గురువారం విజయ్ గవర్నర్ కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. విజయ్ టీవీకే పార్టీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ప్రకటించగా.. ఈవిషయంపై  తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ కూడా వ్యాఖ్యలు చేశారు. విజయ్ ని  చేయండి మాకు  ఎలాంటి అభ్యంతరం లేదంటూ ప్రకటన చేవారు. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి..ఆరునెలల వరకు ఆయన ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్టాలిన్  చెప్పారు. 

టీవీకే పార్టీ ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో 34.92 శాతం ఓట్లు నమోదు చేసుకొని  1967 తర్వాత ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. డీఎంకే, ఏఐఏడీఎంకేలు కలిసి 108 సీట్లను గెలుచుకోలేకోయాయి. ఎంజీఆర్ పేరిట రికార్డుకు బద్దలు కొట్టారు విజయ్. టీవీకే 108సీట్లు, డీఎంకే 59, ఏఐఏడీఎంకే 57 సీట్లును గెలుచుకోవడంతో హంగ్ ఏర్పండి.దీంతఓ అతిపెద్ద పార్టీ గా అవతరించిన  టీవీకే విజయ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేసేందుకు కాంగ్రెస్, వీసీకే, వామపక్షల పార్టీ మద్దతు కోరింది. 

5 సీట్లు కలిగిన కాంగ్రెస్ టీడీపీకి మద్దతు ప్రకటించగా, వీసీకే, వామపక్షాలు ఇంకా తమ మద్దతును వెల్లడించలేదు. టీవీకేకు మెజారిటీ వస్తుందా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందా అనే నేపథ్యంలోనే డీఎంకే, ఏఐఏడీఎంకేలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయన్న వార్త కలకలం రేపింది. ఈ క్రమంలో స్టాలిన్ క్లారిటీ ఇవ్వడంతో  విజయ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు దాదాపుగా లైన్ క్లియర్ అయింది. 

 

©️ VIL Media Pvt Ltd.