July 14, 2026

Viral: ఓ వైపు బండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. అదే సందులో విషపూరిత పాము.. చివరకు ఏమైందంటే..

Viral: ఓ వైపు బండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. అదే సందులో విషపూరిత పాము.. చివరకు ఏమైందంటే..
Reading Time: < 1 minute
Odisha Boy Trapped 8 Hours Venomous Snake Rescue Nayagarh

తేనె సేకరించడం కోసం ఒక బాలుడు కొండ రాళ్ల మధ్య ఉన్న సందులోకి తల పెట్టాడు. అది కాస్తా ఊహించని ప్రమాదానికి దారితీసింది. దాదాపు ఎనిమిది గంటల పాటు ఆ బాలుడు మృత్యువుతో పోరాడాడు. ఎందుకంటే, ఆ ఇరుకైన సందులో అతని తల ఇరుక్కుపోవడమే కాకుండా, అక్కడే ఒక విషపూరితమైన పాము కూడా ఉంది.

నయాగఢ్ జిల్లా కనిపాడ అడవికి షిబా ప్రధాన్ అనే బాలుడు తన బాబాయ్‌తో కలిసి తేనె కోసం వెళ్లాడు. అక్కడ రాళ్ల మధ్య లోపల ఉన్న తేనె పట్టును చూసి, దానిని తీయడానికి ప్రయత్నిస్తుండగా అతని తల అందులో ఇరుక్కుపోయింది. బాబాయ్ ఎంత ప్రయత్నించినా తల బయటకు రాలేదు. దీంతో గ్రామస్థులకు, పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే, ఆ సందులో బాలుడి పక్కనే ఒక పెద్ద విష సర్పం ఉండటంతో రక్షణ చర్యలు చేపట్టడం చాలా కష్టమైంది. చివరికి ఎనిమిది గంటల సుదీర్ఘ పోరాటం తర్వాత సిబ్బంది ఆ బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. అదృష్టవశాత్తూ అతనికి ఎటువంటి పెద్ద గాయాలు కాలేదు. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.