
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. వీడియో ప్రకారం.. పునీత్ సూపర్ స్టార్ అనే ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ తన వింత ప్రవర్తనతో వీడియోలు చేస్తూ ఎప్పిటికప్పుడూ ట్రెడింగ్‌లోకి వస్తుంటాడు. గతంలో మురికి కాలువల దగ్గర వీడియోలు చేసి ఫేమస్ అయిన ఈ వ్యక్తి తాజాగా మరోసాని అలాంటి వీడియోతోనే ట్రెండింగ్‌లోకి వచ్చాడు. కానీ ఈ సారి మాత్రం అతని చేసిన పనికి నెటిజన్లు అవాక్కయ్యారు. ఇటీవల అతను పోస్ట్ చేసిన వీడియోలో పునీత్ ఓ పెద్ద మురికి కాలువ వద్దకు వెళ్లి మొదట అందులో స్నానం చేశాడు. అంతటితో ఆగకుండా, ఆ కాలువ గట్టుపైనే కూర్చుని తినడం ప్రారంభించాడు.
అయితే అతను కాటువ గోడపై కూర్చొని నార్త్ ఇండియన్ ఫుడ్ అయిన చోలే , ఆలూ కుల్చే తింటున్నాడు. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా అతను ఆ ఆలూ కుల్చేలను అక్కడ పారుతున్న మురికి నీళ్లలో ముంచి మరీ తినడం స్టార్ట్ చేశాడు. ఈ తతంగాన్నంత తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ దృశ్యాలు చూస్తుంటేనా తిన్నది అంతా బయటకొచ్చేలా ఉన్నాయి. అలాంటి ప్లేస్‌లో అతని తినడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేశాయి.
ఇక అతను పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అతడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. వ్యూస్ కోసం మరీ ఇంతలా దిగజారాలా?, ఇంతకు మించిన సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటేనే వాంతికి వస్తోందని మరికొందు కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో చూడండి..
मानती हूं सोशल मीडिया influencer क़ा दौर है, और लोग अच्छी कमाई कर लेते हैँ पर…….
इस हद तक जाकर नाले में डुबकी लगाना और गंदे पानी का सेवन करना
… ये तो सरासर जाहिलियत है, कहीं कोई ऐसी वैसी बीमारी हो गयी तो लेने के देने भी पड़ सकते है… pic.twitter.com/OfbT2F2vdW
— ASHaraf (@Yogya_balak) April 28, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
… ये तो सरासर जाहिलियत है, कहीं कोई ऐसी वैसी बीमारी हो गयी तो लेने के देने भी पड़ सकते है…