Reading Time: 2 minutes
Happy Life: కీలక గ్రహాల అనుకూలత.. ఈ రాశుల వారికి హ్యాపీ లైఫ్ ఖాయం..!

జ్యోతిషశాస్త్రంలో గ్రహాల స్థితిగతులకు ఎంత ప్రాధాన్యం ఉందో, వాటి దృష్టులకూ అంతే ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు వృషభ రాశిలో ఉన్న తన మిత్రుడు శుక్రుడిని తృతీయ దృష్టితో వీక్షించడం జరుగుతోంది. అదే సమయంలో మీన రాశిలో ఉన్న కుజుడు మిథున రాశిలో ఉన్న తన మిత్రుడు బృహస్పతిని చతుర్థ దృష్టితో వీక్షించడం జరుగుతోంది. ఈ దృష్టుల వల్ల శుక్ర, గురువులు కొన్ని రాశులకు మరింత శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, మకరం, మీన రాశులకు ఈ దృష్టుల వల్ల మరో 15 రోజుల పాటు ఏ దోషాలూ, ఏ అవయోగాలూ దగ్గరకు రాని పరిస్థితి ఏర్పడింది.

  1. వృషభం: ఈ రాశికి శని, కుజుల అనుకూల దృష్టితో శుక్ర, గురువులకు బలం పెరిగినందువల్ల ఈ రాశి వారికి దైవానుగ్రహం అపారంగా లభిస్తుంది. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఎవరు ఎంత ప్రయత్నించినా వీరి మీద విజయాలు సాధించలేరు. అతి తక్కువ ప్రయత్నంతో వీరు ఘన విజయాలు సాధించడం ఖాయం. సొంత ఇంటి కల, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల నెరవేరుతాయి. ఆర్థిక బలం, అధికార బలం కలుగుతాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది.
  2. మిథునం: ఈ రాశిలో ఉన్న గురువును, ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడిని శని, కుజులు చూడడం వల్ల ఈ రాశివారికి ఇక ఘన విజయాలే తప్ప ఓటమి ఉండదు. ఏ ప్రయత్నం చేపట్టినా నూరు శాతం సక్సెస్ అవుతుంది. ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో నెగ్గుతారు. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.
  3. కన్య: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న గురువును, భాగ్య స్థానంలో ఉన్న శుక్రుడిని శని, కుజుల వీక్షించడం వల్ల ఈ రాశివారికి రాజపూజ్యాలు కలుగుతాయి. ఒకటి రెండు రాజయోగాలు, ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. వీరు పట్టిందల్లా బంగారమవుతుంది. వీరిని ఎటువంటి దోషాలూ అంటే అవకాశం లేదు. వీరి కలలన్నీ సాకారమవుతాయి. సంపన్న స్థితి కలగడంతో పాటు సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
  4. ధనుస్సు: సప్తమ స్థానంలో ఉన్న రాశ్యధిపతి గురువును, స్వస్థానంలో ఉన్న శుక్రుడిని కుజ, శనులు వీక్షిం చడం వల్ల ఈ రాశివారికి వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆదాయ వృద్ధికి అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. అనుకున్న ఆశయాలు, లక్ష్యాలు సాధిస్తారు. పట్టుదల, ఆత్మ విశ్వాసంతో వ్యవహరిస్తారు. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
  5. మకరం: ఈ రాశికి అనుకూల స్థానాల్లో ఉన్న శుక్ర, గురువులను కుజ, శనులు చూడడం వల్ల ఉద్యోగం లోనే కాక, వృత్తి, వ్యాపారాల్లోనూ లక్ష్యాలను, ఆశయాలను అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లోనూ, పెళ్లి ప్రయత్నాల్లోనూ ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. రాజపూజ్యాలు కలుగు తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తి వివాదం సమసిపోతుంది.
  6. మీనం: చతుర్థ స్థానంలో ఉన్న రాశ్యధిపతి గురువును, తృతీయంలో, స్వస్థానంలో ఉన్న శుక్రుడిని కుజ, శనులు వీక్షించడం వల్ల ఈ రాశివారికి విజయాలే తప్ప ఓటమి ఉండకపోవచ్చు. గ్రహ దోషాల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతారు. అధికా రులకు వీరి సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపారాలను లాభాల బాట పట్టిస్తారు. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. షేర్ల వల్ల లాభాలు కలుగుతాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)