Reading Time: 2 minutes
Ap Cabinet Key Decisions Amaravati Projects Polavaram Relief Major Approvals

AP Cabinet Key Decisions: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో మొత్తం 26 అంశాలపై చర్చించి, అభివృద్ధి, మౌలిక వసతులు, పరిపాలన సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది కేబినెట్.. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రధాన ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులకు రూ.443 కోట్ల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అలాగే, అమరావతి సచివాలయంలో గ్లాస్ క్లాడింగ్ సహా వివిధ పనులకు రూ.2540 కోట్ల ప్రణాళికను ఆమోదించింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్స్ నిర్మాణానికి కూడా కేబినెట్ అనుమతి ఇచ్చింది. అసెంబ్లీ పరిసరాల్లో సివిల్ వర్క్స్‌కు రూ.798 కోట్ల ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఉండవల్లి జోన్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.580 కోట్ల ప్రణాళికను కూడా ఆమోదించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల్లో సవరణలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపగా.. పోలవరం ప్రాజెక్ట్ బాధితుల గృహ యూనిట్ ఖర్చు పెంపుకు ఏపీ కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది..

Read Also: Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..

మరోవైపు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS) నిబంధనల్లో సవరణలపై కేబినెట్‌లో చర్చ సాగుతోంది.. అలాగే అమరావతి ప్రాంతంలో భూముల కేటాయింపులపై కీలక నిర్ణయాలు తీసుకుంది. రెవెన్యూ శాఖకు చెందిన భూముల కేటాయింపుల రద్దుపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు.. పోలవరం ప్రాజెక్ట్ బాధితులకు గృహ యూనిట్ ఖర్చు పెంపుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.. డ్రెయిన్ సైఫన్ నిర్మాణ పనులకు రూ.76 కోట్లకు పైగా వ్యయం చేయడానికి అనుమతి ఇవ్వనుంది.. హంద్రీ-నీవా ప్రాజెక్ట్‌కు రూ.3099 కోట్ల సవరణ అంచనాలను కూడా ఆమోదించే అవకాశం ఉంది.. పలు పరిపాలనా నిర్ణయాలు కూడా కేబినెట్‌లో తీసుకున్నారు. హోంశాఖలో 385 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా అప్‌గ్రేడ్ చేయడానికి అనుమతి ఇవ్వనున్నారు.. హైకోర్టు, జిల్లా న్యాయ వ్యవస్థలో 21 కొత్త పోస్టులను సృష్టించారు. పంచాయతీ రాజ్ శాఖలో 20 పోస్టులు సృష్టించడంతో పాటు 9 పోస్టులను అవుట్‌సోర్సింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఇతర కీలక నిర్ణయాల్లో భాగంగా, న్యూ ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124.5 కోట్లు కేటాయించేందుకు సిద్ధమైంది మంత్రివర్గం.. మార్క్‌ఫెడ్‌కు రూ.1800 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్‌కు ప్రభుత్వ హామీ ఇచ్చారు. రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ ఖర్చుల మార్పులకు కూడా ఆమోదం తెలపనుంది.. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వడం, మున్సిపల్ ఆస్తుల లీజ్, రెంట్ ఫిక్సేషన్ నిబంధనల్లో మార్పులు చేయడం, మున్సిపల్ చట్టాల్లో సవరణల బిల్లును ప్రతిపాదించడం వంటి అంశాలను కూడా కేబినెట్ చర్చిస్తుంది.. అదనంగా, తిరుపతి సమీపంలో స్పోర్ట్స్ స్కూల్ కోసం భూముల కేటాయింపు, కడపలో 92 ఎకరాల డంపింగ్ యార్డ్ కోసం భూమి కేటాయింపు, ప్రకాశం జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్, చిత్తూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు భూముల బదిలీ వంటి ప్రతిపాదనలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మొత్తానికి, ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల పెంపుకు దోహదపడే కీలక నిర్ణయాలు తీసుకోబడినట్లు తెలుస్తోంది.