Reading Time: < 1 minute
Whats Today On 30th April 2025

* IPL: ఇవాళ బెంగళూరు వర్సెస్ గుజరాత్.. రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్‌ వేదికగా మ్యాచ్‌

* అమ‌రావ‌తి: ఇవాళ ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఏపీ కేబినెట్ భేటీ.. స‌చివాల‌యంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షత‌న స‌మావేశం.. 60 వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో వివిధ అంశాలకు ఆమోదం. అమరావతి క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి రూ.1208.41 కోట్లు వ్యయం చేసేందుకు అమోదం తెల‌పనున్న కేబినెట్.

* అమరావతి: ఇవాళ ఏపీలో టెన్త్ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చెయ్యనున్న మంత్రి లోకేష్

* తిరుపతి: నేటి నుండి మూడు రోజుల పాటు పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవం..

* తిరుమల: ఇవాళ తరిగోండ వెంగమాంబ జయంతి సందర్భంగా నారాయణ గిరి ఉద్యానవనంలో ప్రత్యేక కార్యక్రమాలు.. నారాయణగిరి ఉద్యానవనంలోకి ఊరేగింపుగా వెళ్లనున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి

* కర్నూలు: నేడు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో ఆఫీస్ ముట్టడి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన