
Prakash Raj: రాముడు, రామాయణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా, ఆయన తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొని, నటుడు-టీవీకే అధినేత విజయ్‌పై విమర్శలు గుప్పించారు. తమిళనాడు పళనిలో జరిగిన సీపీఎం అభ్యర్థి ప్రచారానికి ప్రకాష్ రాజ్ మద్దతు పలికారు. రాష్ట్రంలో ద్రావిడ మోడల్, బానిస మోడల్, సినిమా మోడల్ నడుస్తున్నాయని డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకేలపై గురించి అన్నారు.
Read Also: Fatty liver: ఫ్యాటీ లివర్ ఉన్నవారు ఇలా చేయండి, కొద్ది రోజుల్లోనే నయం..
సినీనటులు సినిమాల్లో ఏ పాత్రలోనైనా నటించవచ్చు, కానీ నిజ జీవితంలో రాజకీయాలు భిన్నంగా ఉంటాయని అన్నారు. సినిమాల్లో డాక్టర్, ఇంజనీర్, సీఎంగా చేయవచ్చు, కానీ నిజ జీవితంలో సీఎం ఎలా అవుతారు.? అని ప్రశ్నించారు. ప్రజల సమస్యల, భాషా గౌరవంపై విజయ్‌కి అవగాహన లేదని అన్నారు. ప్రజలు నటుల్ని ప్రేమిస్తారు, కానీ దేశాన్ని ఇవ్వలేం అని అన్నారు. తమిళ నటుడు సీమాన్‌ను ఉదాహరణగా చూపుతూ.. రాజకీయాల్లోకి రావాలంటే ప్రజల మధ్య పనిచేయాలని, సమస్యలపై మాట్లాడాలని, దీర్ఘకాలం కష్టపడాలని సూచించారు.
రాజకీయంగా విభేదించినా, విజయ్-ప్రకాష్ రాజ్ పలు తమిళ్ సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. వీరిద్దరు గిల్లి, శివకాశి, విల్లు, ఆది వంటి సినిమాల్లో పనిచేశారు. చివరిగా వారిసు సినిమా కోసం పనిచేశారు. విజయ్ లేటెస్ట్ మూవీ జన నాయగన్‌లో కూడా వీరిద్దరు కలిసి నటించారు.