July 13, 2026

Hyderabad: గరంగరం సమోసాలు.. ఇవి తింటే రోగాలు ఫ్రీ..!

Hyderabad: గరంగరం సమోసాలు.. ఇవి తింటే రోగాలు ఫ్రీ..!
Reading Time: < 1 minute
Hyderabad Adulterated Samosa Manufacturing Kulsumpura Food Safety Raid

Hyderabad: గరంగరం సమోసాలు చూస్తేనే కొందరి నోళ్లూరుతుంటాయి…!! లొట్టలేసుకుని మరీ తింటుంటారు.. !! కొందరు ఏకంగా ఐదారు సమోసాలు కూడా లాగించేస్తుంటారు. కుల్సుంపురలో సమోసాల తయారీని ఓసారి చూశారంటే.. జీవితంలో మళ్లీ సమోసా ముట్టరు. కల్తీ నూనే… ముక్కిపోయిన పిండి… అపరిశుభ్ర వాతావరణంలో సమోసాలు తయారు చేస్తున్నారు. వీటిని నగరంలోని బడా బేకరీలు, హోటళ్లు, టీస్టాల్స్‌, కెఫేలకు సప్లై చేస్తున్నారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీతో అసలు బండారం బయటపడింది. అబ్దుల్‌ అనే వ్యాపారి కొందరు వర్కర్లను నియమించుకుని సమోసాలు, ఎగ్‌ పఫ్‌లు, వెజ్‌ పఫ్‌లు తయారు చేస్తున్నాడు. ఉడకబెట్టిన ఎగ్స్‌ను వారం రోజులపాటు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి వాటితో ఎగ్‌పఫ్‌‌లు తయారు చేస్తున్నారు. కుళ్లిపోయిన ఆలు, ఇతర కూరగాయలతో వెజ్‌ పఫ్‌లను చేస్తున్నారు. వీటి కోసం వాడుతున్న ఆయిల్‌ కూడా కల్తీదే అని గుర్తించారు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు. కాలం చెల్లిన పిండితో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. వీటిని హోల్‌ సేల్‌ పేరుతో… నగరంలోని పెద్దపెద్ద బేకరీలు, టీస్టాల్స్‌, హోటళ్లు, కెఫేలకు సప్లై చేస్తున్నారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు… టాస్క్‌ఫోర్స్‌ పోలీసులతో కలిసి ఈ తయారీ గోదాంపై దాడి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తయారీదారుడు అబ్దుల్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ సమోసాలు తింటే రోగాలు రావడం పక్కా.

READ MORE: Theft Gangs: సినీ స్టైల్ చోరీలు.. పోలీసులకు సవాల్ విసురుతున్న ముఠాలు..