Reading Time: < 1 minute

Good News : జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం

Caption of Image.

తెలంగాణ ప్రజలకు శుభావార్త చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలోని ఒక కోటి 15 లక్షల కుటుంబాలకు.. ఐదు లక్షల రూపాయల జీవిత బీమా పథకం అమలు చేయబోతున్నట్లు బడ్జెట్ లో ప్రకటించారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. 2026, జూన్ 2వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారాయన. 

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇది వరం అని.. తెలంగాణలో పుట్టటం.. జీవించటం అనేది వరం అనే విధంగా ప్రభుత్వం ఈ బీమా పథకాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారాయన. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం భరోసా.. ప్రభుత్వం భద్రత కల్పించటానే ఉద్దేశంతో ఈ పథకం తీసుకొస్తున్నట్లు వెల్లడించారాయన. 

కుటుంబంలో సంపాదించే వ్యక్తి దురదృష్ట వశాత్తు.. ఆకస్మికంగా దూరమైతే.. ఆ కుటుంబం వీధిన పడకుండా ఈ బీమా ఆదుకుంటుందన్నారాయన. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భద్రత, భరోసా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారాయన. 

విపత్కర పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించే వ్యక్తి దూరమైతే ఆ కుటుంబం వేదన అంతా ఇంతా కాదు.. ఇదే సమయంలో ఆర్థిక భారంతో ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమల్లోకి తీసుకురానున్నట్లు వివరించారు మంత్రి భట్టి విక్రమార్క. 

ప్రపంచంలోనే ఇలాంటి పథకాన్ని ఏ దేశం.. ఏ ప్రభుత్వం తీసుకురాలేదని.. ఎవరికీ ఇంత వరకు సాధ్యం కాలేదని.. ఇలాంటి మహత్తరమైన జీవిత బీమా పథకాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు మంత్రి భట్టి. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా.. పేద, మధ్య తరగతి అనే వ్యత్యాసం లేకుండా ఈ  పథకాన్ని అమలు చేయబోతున్నామని.. కోటి 15 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా భద్రత, భరోసా లభిస్తుందన్నారు మంత్రి భట్టి విక్రమార్క.

©️ VIL Media Pvt Ltd.