కొండంత బలం రావాలంటే గుప్పెడు తింటే చాలు.. ఎముకల బలం అదుర్స్.. యవ్వనం రివర్స్
బలం కావాలి అంటే తినాల్సింది బయట ఫుడ్స్ కాదు, ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. కొందరు దీని కోసం మెడిసిన్స్ కూడా వాడుతుంటారు. అయితే, అలాంటి వాళ్ళు అవన్నీ పక్కన పెట్టేసి, ఇవి రోజూ గుప్పెడు తీసుకుంటే చాలు. ఎముకలు బలంగా మారతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
నువ్వులను ఇలా తీసుకోవాలి : మీ రోజువారీ డైట్ లో గుప్పెడు నువ్వులు తింటే ఎంతో బలం. ఎందుకంటే, దీనిలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్లు ఇలా శరీరానికి కావల్సిన పోషకాలు ఉన్నాయి. వీటిని తినడం వలన ఎముకలకు అవసరమైన పోషకాలు అందుతాయి. కాబట్టి, వీటిని మీ ఫుడ్ లో చేర్చుకోండి.
రాగి జావ లేదా రాగులు : నిజం చెప్పాలంటే ఈ రాగులలో పాల కంటే కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి, వీటిని కూడా రోజూ గుప్పెడు తీసుకుంటే చాలు. ఇంకా వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వలన ఎముకలు బలంగా అవుతాయి. కాబట్టి, ఉదయం పూట ఆఫీసుకు వెళ్ళేవాళ్ళు వీటిని తప్పక తీసుకోవాలి.
బాదం పప్పులు: విరిగిన ఎముకలు మళ్ళీ బలంగా మారాలంటే వీటిని కూడా రోజూ తినాల్సిందే. ఎందుకంటే, ఇవి ఎముకలను బలంగా మార్చి కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తాయి. ఇంకా దీనిలో కాల్షియంతో పాటు కొవ్వులు, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా యవ్వనంగా ఉండేలా ఇవి చేస్తాయి.
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




