July 14, 2026

అసలు అతడు ఆల్ రౌండరే కాదు.. నెట్టింట మాజీ చీఫ్ సెలక్టర్ కామెంట్స్ వైరల్!

అసలు అతడు ఆల్ రౌండరే కాదు.. నెట్టింట మాజీ చీఫ్ సెలక్టర్ కామెంట్స్ వైరల్!
Reading Time: 2 minutes

అసలు అతడు ఆల్ రౌండరే కాదు.. నెట్టింట మాజీ చీఫ్ సెలక్టర్ కామెంట్స్ వైరల్!

Caption of Image.

Team India: ఇంగ్లండ్ పర్యటనలో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు 4–0తో ఘోర పరాజయాన్ని చవిచూడటంతో జట్టు మేనేజ్‌మెంట్‌తో పాటు ఆటగాళ్ల ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీమిండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే వైఫల్యాలపై బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వరుసగా విఫలమవుతున్నప్పటికీ జట్టులో దూబేను కొనసాగించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆల్రౌండర్ గా జట్టులో ఉన్న అతడు కనీసం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదన్నాదు, ఇంగ్లండ్ పిచ్ లపై షార్ట్ బంతులను ఆడలేకపోతున్నాడని శ్రీకాంత్ మండిపడ్డారు.

దూబే దారుణ ప్రదర్శన.. ఒకే ఓవర్లో 22 రన్స్: 
శనివారం రోజ్ బౌల్ వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో కూడా శివమ్ దూబే ఘోరంగా విఫలమయ్యాడు. బౌలింగ్‌లో ఒక ఓవర్ వేసిన అతడు.. రెండు వికెట్లు తీసుకున్నప్పటికీ, ఏకంగా 22 రన్స్ సమర్పించుకున్నాడు. ఇక బ్యాటింగ్‌లో జట్టుకు అత్యంత కీలకమైన సమయంలో క్రీజులోకి వచ్చి కేవలం 14 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఆశించిన మేర రాణించకపోయిన దూబే.. ఫీల్డింగ్‌లో చేసిన ఒక తప్పు మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది.

బ్రూక్ ఈజీ క్యాచ్ డ్రాప్.. మ్యాచ్ ఇంగ్లాండ్ వశం: 
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను శివమ్ దూబే వదిలి పెట్టాడు. కేవలం 3 రన్స్ వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బ్రూక్.. ఆ తర్వాత 95 రన్స్ చేసి భారత్‌ నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. దీంతో దూబే దారుణమైన ఫీల్డింగ్ తీరుపై నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ ఒక్క క్యాచ్ పట్టుకుని ఉంటే మ్యాచ్ పరిస్థితి మరోలా ఉండేదని పేర్కొంటున్నారు.  

అసలు అతడు ఆల్ రౌండరే కాదు: శ్రీకాంత్
ఈ ఘోర పరాభవంపై మాజీ చీఫ్ సెలక్టర్ శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. శివమ్ దూబేపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దూబే జట్టులో ఉంటే స్టేడియంలో మనం మ్యాచ్‌లు గెలవడం చాలా కష్టం.. బంతి ఎటు వెళ్తుందో అంచనా వేయకుండా దాని చుట్టూ తిరుగుతాడు.. అతడు గ్రౌండ్ లో చాలా అయోమయంగా కనిపిస్తాడని తెలిపాడు. ఐపీఎల్ అయినా, అంతర్జాతీయ క్రికెట్ అయినా అతనికి క్యాచ్‌లు వదిలేయడం ఒక అలవాటుగా మారిపోయిందని విమర్శించాడు. అసలు దూబే వంటి ఆటగాడిని ఆల్ రౌండర్ అనడమే ఒక పెద్ద జోక్.. అతడిని ఇంటర్నేషనల్ క్రికెటర్ అంటేనే నవ్వు వస్తోందని మాజీ క్రికెటర్ శ్రీకాంత్ ఆగ్రహాం వ్యక్తం చేశాడు. 

 

 

©️ VIL Media Pvt Ltd.