July 12, 2026

Dhurandhar 2: రణవీర్ సింగ్ నటనకు ఐకాన్ స్టార్ ఫిదా.. ‘ధురంధర్ 2’ పై అల్లు అర్జున్ రివ్యూ వైరల్!

Dhurandhar 2: రణవీర్ సింగ్ నటనకు ఐకాన్ స్టార్ ఫిదా.. ‘ధురంధర్ 2’ పై అల్లు అర్జున్ రివ్యూ వైరల్!
Reading Time: 2 minutes
Allu Arjun Review Dhurandhar 2 Ranveer Singh Paid Preview Collections

Dhurandhar 2: బాలీవుడ్ సెన్సేషన్ రణవీర్ సింగ్, స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ ఫిలిం ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. అయితే, విడుదలకు ఒక రోజు ముందే నిర్వహించిన పెయిడ్ ప్రివ్యూలకు ఊహించని స్పందన లభించింది. సామాన్య ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ స్పెషల్ షోలను వీక్షించారు.

READ ALSO: Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

బ్లాక్ బస్టర్ అన్న బన్నీ.. రణవీర్‌పై ప్రశంసల జల్లు..
ఈ చిత్రాన్ని పెయిడ్ ప్రివ్యూలో వీక్షించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సినిమా చూసిన వెంటనే తన సోషల్ మీడియా (X) వేదికగా రివ్యూ ఇచ్చారు. సినిమాను ‘బ్లాక్ బస్టర్’ అని కొనియాడడమే కాకుండా, చిత్ర యూనిట్ మొత్తాన్ని ప్రశంసించారు. “‘ధురంధర్ 2’ ఇప్పుడే చూశాను. స్వాగ్‌తో కూడిన దేశభక్తి.. ప్రతి భారతీయుడు గర్వపడే చిత్రం ఇది. సినిమా అంతటా ఈలలు, చప్పట్లు కొట్టే సన్నివేశాలు చాలా ఉన్నాయి. చిత్ర బృందానికి నా అభినందనలు. ఆర్.మాధవన్ నటన అద్భుతం. సాంకేతికంగా సినిమా టాప్ క్లాస్” అని చెప్పారు. “నా సోదరుడు రణవీర్ సింగ్ లాంటి అద్భుతమైన, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన నటుడు మన దేశంలో ఉన్నందుకు గర్వంగా ఉంది. ఆర్వీఎస్ (RVS) మళ్లీ అదరగొట్టాడు. ఇక దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమాతో భారీ సిక్సర్ కొట్టారు. ఒక భారతీయ కథను ‘అంతర్జాతీయ స్వ్యాగ్‌’తో చూపించారు. జై హింద్.” అని అల్లు అర్జున్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

పెయిడ్ ప్రివ్యూలతోనే రికార్డుల వేట షురూ..
గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘ధురంధర్’ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ.1,300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడు సీక్వెల్‌పై ఉన్న హైప్‌తో ఈ చిత్రం కేవలం ఇండియాలోనే రూ.1,300 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ బాక్సాఫీస్ వెబ్‌సైట్ ‘శాక్‌నిల్క్’ (Sacnilk) నివేదికల ప్రకారం.. ‘ధురంధర్ 2’ కేవలం పెయిడ్ ప్రివ్యూల ద్వారానే ఏకంగా రూ.44 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. రెగ్యులర్ రిలీజ్‌కు ముందే ఇంతటి వసూళ్లు రాబట్టడం అంటే, బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ సునామీ మొదలైనట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ సునామీ.. ఎవరెవరికి ఎంత రెమ్యూనరేషన్ అంటే?