Reading Time: < 1 minute
Elista Snowstorm 110 90 65 50 Powerful Cooling With Honeycomb Pads

ఎలిస్టా (Elista) స్నోస్టార్మ్ (Snowstorm) సిరీస్ కొత్త ఎయిర్ కూలర్లు భారత్ లో విడుదల అయ్యాయి. ఈ సిరీస్ వేసవి వేడికి శక్తివంతమైన, ఎనర్జీ ఎఫిషియంట్ కూలింగ్ సొల్యూషన్స్ అందించడానికి రూపొందించారు. ఇది డెసర్ట్ కూలర్లు, పర్సనల్ కూలర్‌లను కలిగి ఉంది. ఇన్వర్టర్ కంపాటిబుల్ మోటార్లు, హై ఎయిర్ థ్రో, హనీకాంబ్ ప్యాడ్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఎలిస్టా వివిధ గది పరిమాణాలకు అనుగుణంగా స్నోస్టార్మ్ 110, స్నోస్టార్మ్ 90, స్నోస్టార్మ్ 65, స్నోస్టార్మ్ 50 అనే నాలుగు స్నోస్టార్మ్ ఎయిర్ కూలర్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేసింది.

Also Read:CM Revanth Reddy: విధులకు గైర్హాజరైన ఉద్యోగులకు జీతం కట్ చేస్తాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

స్నోస్టార్మ్ కూలర్ల విషయానికి వస్తే, అవి అధిక గాలి ప్రవాహం, సుదీర్ఘ కూలింగ్ సైకిల్స్ కోసం రూపొందించబడ్డాయని కంపెనీ చెబుతోంది. స్నోస్టార్మ్ 110, 90, 65 సైజులు పెద్ద గదులు, కార్యాలయాలు, పాక్షికంగా తెరిచి ఉన్న ప్రదేశాలకు అనువైనవి. స్నోస్టార్మ్ 50ని పడకగదులలో ఉపయోగించవచ్చు. ఎలిస్టా స్నోస్టార్మ్ ఎయిర్ కూలర్‌లో మూడు వైపులా తేనెగూడు ఆకారంలో ఉండే కూలింగ్ ప్యాడ్‌లు ఉన్నాయి.

ఇవి మెరుగైన శీతలీకరణను అందిస్తాయి. ఇందులో ఇన్వర్టర్‌కు అనుకూలమైన శక్తివంతమైన మోటార్ ఉంది. విద్యుత్ హెచ్చుతగ్గుల సమయంలో కూడా ఇది సజావుగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. స్నోస్టార్మ్ ఎయిర్ కూలర్‌లో నీటి మట్ట సూచిక, మెరుగైన గాలి ప్రసరణ కోసం ఆటోమేటిక్ నిలువు లూవర్‌లు, మరింత శీతలీకరణ కోసం ఐస్ ఛాంబర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also Read:Railway Zone: విశాఖ రైల్వే జోన్ పనులు.. రైల్వే మంత్రి కీలక వ్యాఖ్యలు..

స్నోస్టార్మ్ ఎయిర్ కూలర్ ధర

కంపెనీ స్నోస్టార్మ్ 110 మోడల్‌ను రూ.25,999 ధరకు విడుదల చేసింది. స్నోస్టార్మ్ 90 మోడల్‌ను రూ.13,999 ధరకు, స్నోస్టార్మ్ 65ను రూ.12,999 ధరకు, స్నోస్టార్మ్ 50ని రూ.10,999 ధరకు విడుదల చేసింది. ఈ కూలర్ల మోటార్‌కు 1 సంవత్సరం వారంటీ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. స్నోస్టార్మ్ 50 మోడల్ పంప్‌కు కూడా 18 నెలల వారంటీ వస్తుంది.