Reading Time: 2 minutes
Joseph Kent Resignation Sparks Controversy White House Reacts To Iran War Leak Claims

అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక అధిపతి జోసెఫ్ కెంట్ రాజీనామా ట్రంప్ ప్రభుత్వంలో తీవ్ర అలజడి సృష్టించింది. ఇరాన్‌తో అమెరికా యుద్ధం చేయడం ఏ మాత్రం ఇష్టం లేదంటూ జోసెఫ్ కెంట్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో అంతర్జాతీయంగా పెను సృష్టించింది.

124

తాజాగా జోసెఫ్ కెంట్ రాజీనామాపై వైట్‌హౌస్ స్పందించింది. ఇరాన్ ఆపరేషన్‌తో కెంట్‌కు ఎలాంటి సంబంధం లేదని.. ఎనిమిది నెలల కన్నా తక్కువ కాలం పాటు ఉగ్రవాద నిరోధక సంస్థకు నాయకత్వం వహించారని తెలిపింది. ఇక ప్రభుత్వంలో సమాచారం లీక్ చేసిన వారిని కనుకొనేందుకు అంతర్గత విచారణ జరుగుతోందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఫాక్స్ న్యూస్‌కు తెలిపారు.

అంతర్గత విభేదాలపై ప్రశ్నలు పెరుగుతున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్‌పై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నారని కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. జాతీయ భద్రతా నాయకత్వంలో ఐక్యతను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. అంతర్గత వివరాలను ఎవరు లీక్ చేసి ఉండవచ్చో గుర్తించడంపై ఇప్పుడు దృష్టి సారించామని లీవిట్ సూచించారు.

జోసెఫ్ కెంట్..
అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక అధిపతి జోసెఫ్ కెంట్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో సంచలన విషయాలు వెల్లడించారు. తన మనస్సాక్షికి విరుద్ధంగా ఇరాన్‌తో యుద్ధానికి మద్దతు ఇవ్వలేనని ప్రకటించారు. ఇజ్రాయెల్ ఒత్తిడితోనే ట్రంప్ ఇరాన్‌పై యుద్ధం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఇరాన్ నుంచి అమెరికాకు ఎలాంటి తక్షణ ముప్పు ఉండబోదని పేర్కొన్నారు.

పశ్చిమాసియా యుద్ధాలు అమెరికా ప్రాణాలను హరించి, దేశ సంపదను హరించివేస్తాయనే విషయం ట్రంప్‌కు 2025 జూన్ వరకు తెలుసని తన లేఖలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు, అమెరికా మీడియాలోని ప్రభావవంతమైన సభ్యులు. ఒక తప్పుడు సమాచారం ద్వారా ఇరాన్‌తో యుద్ధాన్ని ప్రోత్సహించారని తెలిపారు. ట్రంప్‌పై ‘‘ఎకో ఛాంబర్’’ను ఉపయోగించారని కెంట్ ఆరోపించారు. ఇరాన్‌తో యుద్ధం ముగించుకుంటే మంచిదని.. లేదంటే దేశాన్ని మరింత గందరగోళంలోకి నెట్టగలరని అభిప్రాయపడ్డారు.