Reading Time: 2 minutes
Dhurandhar 2 Release Tomorrow Ranveer Singh Runtime Rating Updates

Dhurandhar 2: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ ఏవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురందర్: ది రివెంజ్’ విడుదలకు రంగం సిద్ధమైంది. సంచలన దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సీక్వెల్ రేపు (మార్చి 19, 2026) ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఉగాది, గుడి పడ్వా, ఈద్ పండుగల సీజన్ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు ఆదిత్య ధర్ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు ఒక విన్నపం చేశారు. సినిమాలోని ట్విస్టులు, సర్ప్రైజ్ ఎలిమెంట్స్‌ను రివీల్ చేయవద్దని, స్పాయిలర్స్ ఇవ్వకుండా ఇతరుల ఉత్సాహాన్ని దెబ్బతీయొద్దని కోరారు. అలాగే ఈ సినిమా ఎండ్ కార్డ్స్ పడే వరకు సీట్‌లో నుంచి లేవ వద్దని చెప్పారు. దీంతో ధురంధర్-3 కూడా ఉండే అవకాశం ఉందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. మిడ్‌నైట్ షోలు, ప్రీమియర్లకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది.

READ ALSO: Yamaha Scooter: కార్లకే కాదు.. స్కూటర్‌కి కూడా ఎయిర్‌బ్యాగ్.. యమహా ట్రైసిటీ 300 రివల్యూషన్

రణవీర్ సింగ్ ‘మాస్’ విశ్వరూపం..
ధురందర్ పార్ట్ వన్ హిందీలో సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. ఇప్పుడు రెండో భాగం హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అవుతుంది. రణవీర్ సింగ్ ఇంటెన్స్ ఏజెంట్ పాత్రలో కనిపిస్తుండగా.. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగమయ్యారు. “ఇది కొత్త భారత్.. ఇంట్లోకి జొరబడి మరి కొడుతుంది” అనే డైలాగ్ ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమా నిడివి (Run-time) ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాదాపు 3 గంటల 49 నిమిషాల (229 నిమిషాలు) సుదీర్ఘ నిడివితో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ఉన్న ఇంటెన్స్ యాక్షన్, హింసాత్మక సన్నివేశాల కారణంగా సెన్సార్ బోర్డు ఈ మూవీకి ‘A’ (Adults Only) సర్టిఫికేట్ జారీ చేసింది. శాశ్వత్ సచ్‌దేవ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందని చిత్ర బృందం చెబుతుంది.

READ ALSO: Peddi: ‘పెద్ది’ సెట్స్‌లో వరల్డ్ కప్ హీరో.. రామ్ చరణ్ స్పోర్ట్స్ యాక్షన్‌కు యువ క్రికెటర్ ఫిదా!