Reading Time: < 1 minute
Iran Sets Three Conditions To End War Amid Global Oil Crisis

పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టింది. గత నెల 28న ప్రారంభమైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అయితే యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. దీంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. దీంతో యుద్ధం ముగింపునలకు ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి.

ఈ నేపథ్యంలో యుద్ధం ముగింపునకు ఇరాన్ ముందుకొచ్చింది. అయితే యుద్ధం ముగింపునకు ఇరాన్ మెలిక పెట్టింది. యుద్ధం ముగింపునకు ప్రపంచం ముందు 3 షరతులు పెట్టింది. వాటికి అంగీకరిస్తే యుద్ధం ముగిస్తామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

మొదటి షరతు.. ఇరాన్ హక్కులను గుర్తించాలి.
రెండో షరతు.. యుద్ధానికి పరిహారం చెల్లించడం.
మూడో షరతు… భవిష్యత్ దాడులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ హామీలు ఇవ్వడం. ఈ మూడు షరతులకు అంగీకరిస్తే వెంటనే యుద్ధం ముగిస్తామని అధ్యక్షుడు పెజెష్కియన్ స్పష్టం చేశారు.

గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. ఖమేనీ సహా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై విరుచుకుపడింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. యుద్ధాన్ని ముగించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ మూడు షరతులను విధించింది. ఈ షరతులపై ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.